సినిమా

Hansika Motwani: అభిమానులకు హన్సిక గుడ్ న్యూస్.. వరుస సినిమాలతో, బోల్డ్ పాత్రలతో..

Hansika Motwani: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కొద్దికాలంలోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది హన్సిక.

Hansika Motwani (tv5news.in)
X

Hansika Motwani (tv5news.in)

Hansika Motwani: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అతి కొద్దికాలంలోనే హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకుంది హన్సిక. కెరీర్ మొదట్లోనే టాలీవుడ్, కోలీవుడ్‌లో విపరీతమైన స్టార్‌డమ్‌ను చూసిన హన్సిక.. మెల్లగా ఫేడవుట్ అయిపోయింది. సినిమా అవకాశాలు వస్తున్నా కూడా.. అవి అంతగా హిట్ కాకపోవడంతో మెల్లగా తాను పోటీని తట్టుకోలేక వెనకబడిపోయింది. ఇప్పుడు ఈ ముంబాయి భామ తనకు ఫ్యాన్స్‌కు ఊహించని గుడ్ న్యూస్‌ను వినిపించింది.

2019 విడుదలయిన తెనాలి రామకృష్ణ బీఏ. బీఎల్.లో చివరిసారిగా కనిపించింది హన్సిక. ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను అంతగా ఎంటర్‌టైన్ చేయలేకపోయింది. దాని తర్వాత కొంతకాలం హన్సిక వెండితెరపై కనిపించలేదు. కానీ 2021 మాత్రం ఒకేసారి అయిదు సినిమాలకు శ్రీకారం చుట్టింది హన్సిక. అందులో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు కావడం విశేషం.

2021లో ప్రారంభించిన అయిదు సినిమాలతో పాటు మరో నాలుగు సినిమాలను కూడా సైన్ చేసిందట హన్సిక. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న అయిదు సినిమాలు.. ఏడాదిలో ఏ సమయంలో అయినా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా నాలుగు సినిమాలు కూడా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నాయని తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపించింది హన్సిక.

Next Story

RELATED STORIES