సినిమా

Samantha Item Song: 'పుష్ప'లో సమంతను హాట్‌గా తయారు చేసింది అతడే.. ప్రీతమ్ జుకల్కర్‌ను కాదని..

Samantha Item Song: 'పుష్ప' సినిమా రికార్డ్ కలెక్షన్లతో, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

Samantha Item Song: పుష్పలో సమంతను హాట్‌గా తయారు చేసింది అతడే.. ప్రీతమ్ జుకల్కర్‌ను కాదని..
X

Samantha Item Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా రికార్డ్ కలెక్షన్లతో, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా వల్ల కేవలం అల్లు అర్జున్, రష్మికకు మాత్రమే కాదు అందులో నటించిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు లభించింది. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం పుష్ప సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. ఐటెమ్ సాంగ్ మాత్రం మరో ఎత్తు అంటున్నారు. అయితే సమంత పాటలో అంత అందంగా కనిపించడానికి కారణం ఓ యంగ్ స్టైలిస్ట్.

ఏమాయ చేశావే సినిమా నుండి సమంతను పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లలోనే ఎక్కువగా చూశాం. టాలీవుడ్లో హీరోయిన్‌గా నిలదొక్కుకున్న తర్వాత తానే కొత్త కథల వైపు, విభిన్న పాత్రల వైపు అడుగులేసింది. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఇంతకాలం అయినా.. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించినా.. సామ్ ఎక్స్‌పోజింగ్ చేసింది చాలా తక్కువే. కానీ పుష్ప సినిమాతో సామ్ పూర్తిగా రూట్ మార్చేసినట్టుగా కనిపించింది.

దాదాపు 10 సంవత్సరాల నుండి సమంతను చాలాసార్లు మోడర్న్‌గా, కొన్నిసార్లు ట్రెడీషినల్‌గా చూశారు ప్రేక్షకులు. కానీ పుష్పలో కనిపించినంత హాట్‌గా మాత్రం సమంతను ఇంతకు ముందు చూసింది లేదు. దానికి కారణం మోహిత్ రాయ్ అనే ఓ యంగ్ స్టైలిస్ట్. మామూలుగా సమంత ప్రతీ సినిమాకు, ఈవెంట్స్‌కు ప్రీతమ్ జుకల్కర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తాడు. కానీ పుష్పలో హాట్ టచ్ కోసం మోహిత్ రాయ్‌ను ఎంచుకుంది మూవీ టీమ్.

బాలీవుడ్‌లోని టాప్ స్టైలిస్ట్‌లలో మోహిత్ రాయ్ ఒకడు. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు తాను పర్సనల్ స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. సోనాక్షి సిన్హాలాంటి హీరోయిన్స్‌కు చాలాకాలం నుండి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు మోహిత్ రాయ్. సెక్సీగా కనిపించడానికి చాలా కష్టపడ్డానంటూ సమంత పెట్టిన పోస్ట్‌లో మోహిత్ రాయ్‌కు స్పెషల్‌గా థాంక్యూ చెప్పుకుంది సమంత.

Next Story

RELATED STORIES