Health tips: ఒత్తిడి ఎక్కువవుతోందా..? మీకోసం కొన్ని సెలబ్రిటీల చిట్కాలు..

Health tips: ఒత్తిడి ఎక్కువవుతోందా..? మీకోసం కొన్ని సెలబ్రిటీల చిట్కాలు..
Health tips: ఉద్యోగం అయినా వ్యాపారం అయినా దేనికి ఉండాల్సిన ఒత్తిడి దానికి ఉంటుంది.

Health tips: ఉద్యోగం అయినా వ్యాపారం అయినా దేనికి ఉండాల్సిన ఒత్తిడి దానికి ఉంటుంది. అలాగే సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా చాలానే ఒత్తిడి ఉంటుంది. చెప్పిన సమయానికి చెప్పిన చోటుకి షూటింగ్‌కు వెళ్లాలి. వాతావరణం అనుకూలించకపోయినా, సరిగ్గా విశ్రాంతి లేకపోయినా.. అదంతా మొహంలో కనిపించకుండా నటించగలగాలి. వీటన్నింటి వల్ల వారు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. అందుకే ఒత్తిడి పోగొట్టుకోవడానికి వారేం చేస్తారో అభిమానులతో పంచుకున్నారు కొందరు సినీ తారలు.

ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన ఫిజిక్‌కు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం దాదాపు నాలుగు సినిమా షూటింగ్‌లలో ఒకేసారి పాల్గొంటున్న ప్రభాస్‌కు క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతోంది. ఇందులో ఉన్న ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రభాస్ వ్యాయామం చేస్తాడట. షూటింగ్ ఏ సమయంలో ఉన్నా కాస్త ఒత్తిడి అనిపించినప్పుడు వర్కవుట్స్‌పై దృష్టి పెడతాడట ప్రభాస్.


మహేశ్ బాబు

మహేశ్ బాబు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా జెంటిమ్యానే. అంతే కాదు ఆయన పక్కా ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్స్‌కు బ్రేక్ దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో సంతోషంగా గడిపే క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు మహేశ్. అయితే అదే తన ఒత్తిడిని తగ్గించుకునే మార్గం అని ఆయన అంటున్నారు. షూటింగ్ సమయంలో ఎంత ఒత్తిడికి లోనైనా కూడా ఇంటికి వెళ్లగానే తన కుటుంబంతో గడుపుతూ ఆ ఒత్తిడిని అంతా మర్చిపోతారంట మహేశ్.


రామ్ చరణ్‌

ఈకాలంలో చాలామంది సెలబ్రిటీలకు పెట్స్ ఉన్నాయి. అంతే కాదు వాటిని వారి ఫ్యామిలీలో ఒకరిగా కూడా చూసుకుంటున్నారు. అలాగే రామ్ చరణ్‌కు కూడా ఒక కుక్కపిల్ల ఉంది. తన పని ఒత్తిడిని మర్చిపోవడానికి ఆ పప్పీతో కాసేపు సరదాగా గడిపేస్తాడట చరణ్. బాగా అలసటగా అనిపించినప్పుడు ఇంట్లోవాళ్లతో కాసేపు కబుర్లు చెప్తారట. ఈ రెండు పనులు చేయడం వల్లే తాను ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతున్నా అన్నారు చరణ్.


సమంత

సమంత ఎప్పుడూ తన మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోవాలనే చూస్తుందని తన ఫ్యాన్స్, సన్నిహితులు అంటుంటారు. మరి ప్రశాంతత కోసం యోగా కంటే బెస్ట్ మెడిసిన్ ఏముంటుంది. ఒకవైపు మూవీస్, మరోవైపు బిజినెస్‌లో బిజీగా ఉండే సమంత ఒత్తిడి అనిపించినప్పుడల్లా యోగా చేస్తుందట. అంతే కాక తన కుక్కపిల్లలతో గడపడం కూడా తనకు ప్రశాంతత ఇస్తోందని సమంత చెప్తున్నారు.


రష్మిక

మ్యూజిక్ అనేది మైండ్‌కు చాలా ప్రశాంతత ఇస్తుంది. కాసేపు సినిమాలు చూడడం, పాటలు వినడం.. లాంటివి ఎవరినైనా ఒత్తిడి నుండి దూరం చేస్తాయి. కన్నడ బ్యూటీ రష్మికకు కూడా అంతేనట. తాను కూడా ఎప్పుడైనా బాగా ఒత్తిడి ఫీల్ అయినప్పుడు కాసేపు రిలాక్స్ అయ్యి పాటలు వింటుందట. అంతే కాసేపట్లో తన ఒత్తిడి మాయమవుతుంది అంటుంది రష్మిక.



Tags

Read MoreRead Less
Next Story