Prabhas: ప్రభాస్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం

Prabhas: ప్రభాస్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం

కోలీవుడ్లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్లుగా మణిరత్నం, శంకర్ పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ ఎక్కువగా వినిపిస్తున్న పేరు లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ సినిమాతో లోకేష్ కనగరాజ్ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. అతనితో సినిమాలు తీయడానికి తెలుగు హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్నాళ్ళుగా రామ్ చరణ్, లోకేష్ కాంబోలో సినిమా రాబోతుందనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో పాన్ ఇండియా హీరో పేరు తెరపైకి వచ్చింది. ఆ స్టార్ హీరోనే ప్రభాస్. తాను చేస్తున్న లియో తర్వాత ప్రభాస్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు లోకేష్. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

మణిరత్నం, శంకర్ ఇంకా ఫామ్ లోనే ఉన్నప్పటికీ లోకేష్ కనగరాజ్ కేవలం నాలుగు సినిమాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. కార్తీతో తీసిన ఖైదీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన లోకేష్...ఆ తర్వాత కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా 400ల కోట్లకు పైగా కొల్లగొట్టింది. విక్రమ్ తో కమల్ హాసన్ క్రేజీ కూడా పెరిగిందంటే అతిశయోక్తి కాదు.

విక్రమ్ తో సినిమాతో మిగతా బాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు దళపతి విజయ్ తో లియో అనే సినిమా తీస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా లెవల్లోనే రాబోతుంది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా వచ్చింది కానీ... అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ లియోపై మాత్రం అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా దసరా లేదా దీపావళికి బరిలో దిగుతుంది. లోకేష్ కనగరాజ్ తో తెలుగు హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజానికి కొన్నాళ్ళుగా రామ్ చరణ్ తో లోకేష్ సినిమా ఉందనే వార్త వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ప్రభాస్ పేరు తెరపైకి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story