సినిమా

Rajasekhar : రాజశేఖర్ కి దర్శకుడు కొరటాల బంపరాఫర్... స్టార్ హీరో సినిమాలో

Rajasekhar : కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలని తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాలశివ సిద్దహస్తడు.

Rajasekhar : రాజశేఖర్ కి దర్శకుడు కొరటాల బంపరాఫర్... స్టార్ హీరో సినిమాలో
X

Rajasekhar : కమర్షియల్ కథలకి సందేశాన్ని జోడించి సినిమాలని తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాలశివ సిద్దహస్తడు. ప్రస్తుతం ఆయన చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. ఫైనల్ స్టేజీలో ఈ సినిమా ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌‌‌తో ఓ సినిమాని చేస్తున్నారు కొరటాల.. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌‌లో వస్తోన్న ఈ రెండో సినిమాని పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్‌‌గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని టాక్.. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కీయరా అద్వానీ నటిస్తోందని తెలుస్తోంది. ఇదిలావుండగా ఈ సినిమా నుంచి ఓ క్రేజే అప్డేట్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. సినిమాలోని ఓ కీలక పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నాడట. ఆ రోల్ ఎన్టీఆర్ కి బాబాయ్ అని తెలుస్తోంది. పాత్ర కూడా నచ్చడంతో రాజశేఖర్ ఒకే చెప్పినట్టుగా భోగట్టా.

కాగా మంచి పాత్రలు వస్తే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేందుకు తాను రెడీ అని రాజశేఖర్ ఇప్పటికే అనౌన్సు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా శేఖర్ అనే మూవీ తెరకెక్కుతుంది. జీవిత రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story

RELATED STORIES