సినిమా

Maa Elections 2021 Results: మంచు విష్ణు ప్యానల్‌లో ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం..

Maa Elections 2021 Results : మా ఎన్నికల ఫలితాలు చివరి వరకు ఉత్కంఠను పెంచాయి. ఇప్పుడు ఫలితాలు వచ్చాయి.

siva balaji (tv5news.in)
X

siva balaji (tv5news.in)

Maa Elections 2021 Results : మా ఎన్నికల ఫలితాలు చివరి వరకు ఉత్కంఠను పెంచాయి. ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. మంచు విష్ణు ప్యానల్ నుంచి ట్రెజరర్ గా పోటీ చేసిన శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ట్రెజరర్ గా పోటీ చేసిన నాగినీడుపై ఆయన గెలుపును సొంతం చేసుకున్నారు.

శివబాలాజీ విజయంతో మంచు విష్ణు ప్యానల్లో ఆనందం నెలకొంది. కీలకమైన పోస్టు మంచు విష్ణు ప్యానల్ సొంతమైంది. దీంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్ కొంత డీలా పడినా.. మిగిలిన స్థానాలపై ఆశతో ఉంది.

ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య భీకరమైన పోరు నడిచింది. పోలింగ్ సందర్భంగానూ అదే సీన్ చోటు చేసుకుంది. హీరో శివబాలాజీ చేతిని నటి హేమ కొరకడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అదేమంటే.. తాను వెళుతుంటే.. శివబాలాజీ అడ్డుకున్నారని అందుకే ఆయన చేయి కొరికానని తరువాత హేమ వివరణ ఇచ్చుకున్నారు.

హేమ చేసిన పనికి.. శివబాలాజీ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ముందు జాగ్రత్తగా డాక్టర్లు ఆయనకు టీటీ ఇంజక్షన్ ఇచ్చారు. అసలు హేమ ఎందుకు అలా చేశారో తనకు అర్థం కాలేదని.. అసలా విషయం చెప్పుకోవడానికే ఏదోలా ఉందన్నారు శివబాలాజీ.

Next Story

RELATED STORIES