Aditi Rao Hydari: సిద్ధార్ధ్ తో రిలేషన్ షిప్ పై అదితి రావు క్లారిటీ..!

Aditi Rao Hydari: సిద్ధార్ధ్ తో రిలేషన్ షిప్ పై అదితి రావు క్లారిటీ..!

అదితి రావు హైదరీ నటిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ గా తనకు నచ్చిన ప్రాజెక్టును చేస్తూ ప్రత్యేక ముద్రను వేసుకుంది. కంటెంట్ నచ్చితేగాని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనంటోంది. పాత్ర చిన్నదైనా ప్రత్యేకతకే తన ఓటు అంటోంది. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన హీరామండీలోనూ తళుక్కుమంది.

"నటిగా వివిధ పాత్రలు, జానర్ లు చేసి మాకు మేము సవాలు విసురుకోవాలనుకుంటాం. అందులో భాగంగా ఓపెన్ మైండ్ గా ఉండాలి. మూసధోరణి అనేది ప్రతీ చిత్ర పరిశ్రమలో జరుగదు. నేను కనిపించే తీరు ప్రతీ క్షణం విలక్షణంగా ఉండాలనుకుంటాను. అందుకు గర్వంగా ఉంది. నేను ఆహార్యం నా వ్యక్తిగతం. ఆ విషయంపై ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను" అని అదితి తెలిపింది.






డేటింగ్ పై క్లారిటీ..!
తాజాగా.. అదితి హీరో సిద్దార్థ్ కలిసి ఉన్న వీడియో వైరల్ అయింది. అందులో ఈ జంట గెంతులు వేస్తూ కనిపిస్తారు. ఎప్పటి నుంచో అదితి, సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా సైతం అదితిని పలుమార్లు ప్రశ్నించింది. కానీ తన ప్రేమాయణం గురించి పెదవి విప్పలేదు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అదితి "నా స్నేహితులు, వ్యక్తిగత జీవితం, కుటుంబం ఎవరైనా సరే నాకు చాలా ప్రత్యేకమైన వారు. అలాంటి వారి గురించి నేను అణువైన వేదికపైనే మాట్లాడతాను. అందుకు తగిన సమయం రావాలి" అని చెప్పింది. ప్రజలు తమకు ఏది ముఖ్యమో దాని గురించి మాట్లాడుకుంటారని తెలిపింది అదితి. వారిని కంట్రోల్ చేయడం కంటే మారి మాటలను విని ఆనందించడమే మంచిదని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story