Maheswari : నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావ్‌.. సుధీర్‌‌కి కౌంటర్ ..!

Maheswari : నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావ్‌.. సుధీర్‌‌కి కౌంటర్ ..!
Maheswari : సుడిగాలి సుధీర్ అటు కమెడియన్ గా ఇటు హోస్ట్ గా మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే..

Maheswari : సుడిగాలి సుధీర్ అటు కమెడియన్ గా ఇటు హోస్ట్ గా మెప్పిస్తోన్న సంగతి తెలిసిందే.. సుధీర్ హోస్ట్ గా చేస్తోన్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి తాజాగా హీరోయిన్ మహేశ్వరి అతిధిగా విచ్చేసి సందడి చేశారు. అయితే షోలో భాగంగా ఆమెను ఆహ్వానిస్తూ సుధీర్‌ ఆమెతో చెయ్యి కలిపే ప్రయత్నం చేశాడు. 'హాయ్‌'కి బదులు ఆమె తెలివిగా నమస్కారం చేశారు మహేశ్వరి.. ''ఇదేంటి నేను హాయ్‌ చెప్తే మీరు నమస్కారం పెడుతున్నారు?'' అని సుధీర్‌ ప్రశ్నించగా 'వద్దు బాబూ..! నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావ్‌' అంటూ మహేశ్వరి పంచ్‌తో నవ్వులు పూయించారు.

మేడమ్‌.. నన్ను ఎక్కడ ఉండమంటారని సుధీర్‌ అడగగా 'నా నుంచి మాత్రం దూరంగా ఉండు చాలు అంటూ మహేశ్వరి కౌంటర్ వేసింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది మహేశ్వరి.. ఆ తర్వాత నీకోసం, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ మొదలగు హిట్ చిత్రాలలో నటించింది.

తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నప్పుడు మహేశ్వరి సినిమా పరిశ్రమను విడిచిపెట్టింది. 2008లో తిరుపతిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జయకృష్ణను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పలు సీరియల్స్ నటించి మెప్పించింది మహేశ్వరి.



Tags

Read MoreRead Less
Next Story