Hi Nanna: ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Hi Nanna: ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ కు ముహూర్తం ఖరారు
నాని లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న' సినిమా నుంచి క్రేజీ అప్ డేట్

'దసరా' తర్వాత హీరో నానీ 'హాయ్ నాన్న' సినిమాతో వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీకి ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ మూవీ మ్యూజిక్ మ్యాజిక్ చేయబోతోందని నాని రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. అంతేకాదు, చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఇందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్, బ్యాగ్రౌండ్ లో సముద్రపు అలలు కనిపించాయి. దాంతో పాటు త్వరలోనే మ్యూజిక్ ప్రారంభం అవుతుందంటూ తెరమీద కనిపించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తొలి లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

‘సమయమే’ అంటూ సాగే ఈ సాంగ్ ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే నాని ఓ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. హాయ్.. సెప్టెంబర్ 18, ఫాల్ ఇన్ లవ్’ అనే క్యాప్షన్ తో దీన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళీ సంగీత దర్శకుడు హీషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ను టీ సిరీస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో ఆడియో రైట్స్ కోసం రూ. 9 కోట్లతో డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల కలిసి వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాని కూతురిగా బేబి కైరా ఖన్నా కనిపించనుంది. ఇందులో శృతి హాసన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాను డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story