Krish 4: 'క్రిష్ 4' వాయిదా ?.. రాకేష్ రోషన్ కీలక వ్యాఖ్యలు

Krish 4: క్రిష్ 4 వాయిదా ?.. రాకేష్ రోషన్ కీలక వ్యాఖ్యలు
'క్రిష్ 4' పోస్ట్ పోన్..! సంచలన వ్యాఖ్యలు చేసిన రాకేష్ రోషన్

'క్రిష్', 'క్రిష్ 2', 'క్రిష్ 3'లతో బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. ఇప్పుడు 'క్రిష్ 4'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 4 దశాబ్దాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. ఈ సూపర్ హీరో చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై హృత్రిక్ తండ్రి రాకేష్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్లతో హృత్రిక్ ఫ్యాన్ల్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటీ.. అసలు సినిమా గురించిన లేటెస్ట్ అప్ డేట్ ఏంటి అన్న విషయానికొస్తే...

క్రిష్ 4 ఆలస్యం?

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ రోషన్.. నేటి కాలంలో 'క్రిష్ 4'ని రూపొందించడంపై తన ఆందోళనను వ్యక్తం చేశాడు. "ఇండస్ట్రీలో బిజినెస్ బాగా పుంజుకుంది. ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారు కానీ మునుపటి కంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లకు వెళ్లడం లేదు. ఈ రోజుల్లో ప్రపంచం చిన్నబోతోందని రాకేష్ పంచుకున్నారు. పిల్లలు హాలీవుడ్ చేసిన సూపర్ హీరోల సినిమాలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కూడా ఆకాశాన్ని తాకుతోంది. దాదాపు 500 నుంచి 600 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో సినిమాలను నిర్మిస్తున్నారు. వారి బడ్జెట్‌తో పోల్చితే, హృతిక్ రోషన్ నటిస్తోన్న క్రిష్ 4 చిత్రం రూ. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంద"ని రాకేష్ చెప్పుకొచ్చారు.

"హాలీవుడ్ చిత్రాలకు ఒక ప్రమాణం ఉంటుంది. అలాంటి సినిమాలకు భారతదేశంలోనూ భారీగానే అభిమానులున్నారు. అయితే చెప్పిన బడ్జెట్‌లో ఈ సినిమాకు అదే లుక్‌ అండ్‌ ఫీల్‌ ఇవ్వడం ఎలా? యాక్షన్ సన్నివేశాలను తగ్గించినా.. క్వాలిటీ విషయంలో మాత్రం సమానంగా ఉండాలి. అలాగే, VFX కూడా బాగుండాలి. VFX పెట్టుబడికి చాలా పెద్ద మొత్తం అవసరం" అని రాకేష్ రోషన్ అన్నారు. బడ్జెట్, నిర్మాణ వ్యయాన్ని నిర్వహించడానికి వారు మార్గాలను కనుగొంటున్నట్లు చిత్రనిర్మాత పంచుకున్నారు. అయితే పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా చిత్రీకరణపై పలు ఆందోళనలు ఉన్నప్పటికీ, రాకేష్ రోషన్ 'క్రిష్ 4' కోసం ముందడుగు వేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడం, నిర్మాణ వ్యయంతో సరిపోలకపోవడం అన్న ఆయన వ్యాఖ్యలు పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. "ఇది జరగుతుంది, కానీ ఒక సంవత్సరం కాదు. బహుశా ఆ తర్వాత కావచ్చు" అని రాకేష్ చెప్పుకొచ్చారు. 'క్రిష్ 4' అభిమానులకు చెప్పేదేమంటే.. ఆలస్యం అయినా నాణ్యమైన కంటెంట్‌ను అందించడం కూడా అవసరం అని ఆయన అన్నారు.

ఈ లెక్కన చూస్తుంటే.. రాకేష్ రోషన్ వ్యాఖ్యలు 'క్రిష్ 4' మరింత ఆలస్యం అవుతుందనే వాదనను నిజం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోన్న అభిమానులు.. ఈ కామెంట్లతో డిసప్పాయింట్ అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story