Hyper Aadi: హైపర్ ఆది పెళ్లి గురించి తండ్రి ఆసక్తికర కామెంట్స్..

Hyper Aadi (tv5news.in)

Hyper Aadi (tv5news.in)

Hyper Aadi: కామెడీ షోలో ముందుగా ఓ కమెడియన్‌గా పరిచయమయ్యి.. ఆ తర్వాత టీమ్ లీడర్ స్థాయి వరకు ఎదిగాడు హైపర్ ఆది.

Hyper Aadi: ఒక స్టాండప్ కామెడీ షోలో ముందుగా ఓ కమెడియన్‌గా పరిచయమయ్యి.. ఆ తర్వాత టీమ్ లీడర్ స్థాయి వరకు ఎదిగాడు హైపర్ ఆది. తన ప్రాసకు, పంచులకు, బాడీ లాంగ్వేజ్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. తన కామెడీ స్కిట్‌ను టీవీలో చూసేవారు మాత్రమే కాకుండా యూట్యూబ్‌లో ప్రత్యేకంగా చూసేవారు కూడా చాలామందే ఉంటారు. తాజాగా హైపర్ ఆది పెళ్లి గురించి రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

వెండితెరపై మాత్రమే కాదు.. బుల్లితెరపై కూడా కాస్త పేరొచ్చిన తర్వాత అందరూ అడిగే మొదటి ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని.. ప్రస్తుతం హైపర్ ఆది కూడా అదే ప్రశ్నను ఎదుర్కుంటున్నాడు. దాదాపు ఏడు సంవత్సరాల నుండి కామెడీ షోతో వెలిగిపోతున్న ఆది.. ఇప్పుడిప్పుడే ఇతర షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను మ్యాక్సిమం ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

సాధారణంగా ఏ పండుగ వచ్చినా దానికి స్పెషల్‌గా షోస్‌ను ప్లాన్ చేసింది ఓ ప్రముఖ ఛానెల్. ఇలాంటి పండగ స్పెషల్ షోస్ ద్వారా ఛానెల్‌కు కూడా బాగానే టీఆర్‌పీలు వస్తాయి. అయితే న్యూ ఇయర్ సందర్భంగా హైపర్ ఆది.. తన తండ్రిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే ఆది పెళ్లి గురించి తన తండ్రిని అడగగా.. ఇప్పటికే ఒంగోలులో ఓ అమ్మాయిని చూశామని.. కానీ ఆది రిజెక్ట్ చేశాడని తెలిపారు. పెళ్లికి మరో రెండేళ్లు టైమ్ కావాలని ఆది అడిగినట్టు ఆయన స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story