Rajinikanth : తలైవాకు మరో అవార్డు.. ఆగని రజినీ రికార్డులు..
Rajinikanth : లెజండరీ యాక్టర్ రజనీకాంత్‌కు రికార్డులు, అవార్డులు కొత్తేమికాదు. సూపర్ స్టార్ రజనీ తాజాగా సరికొత్త అవార్డ్ అందుకున్నారు. అయితే అది సినిమా అవార్డు కాదు. ఆదాయపన్ను శాఖ ఇచ్చిన అరుదైన గౌవరం. ఇన్‌కమ్ ట్యాక్సీలను సకాలంలో చెల్లించినందుకు ఆదాయ పన్ను శాఖ రజనీని అభినందిస్తూ ఓ అవార్డ్ ను ప్రదానం చేసింది. దీన్ని రజనీకాంత్ తరఫున ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ స్వీకరించారు.
తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ దినోత్సవాన్ని చెన్నైలో నిర్వహించారు. క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తుండడంతో ఆదాయపు పన్ను శాఖ రజనీకాంత్‌ని ఈ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డుని తెలంగాణ గవర్నర్ తమిళి సై చేతుల మీదుగా రజనీ తరుఫున ఆయన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ అందుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బెస్ట్ ట్యాక్స్ పేయర్ కూతురిగా గర్వపడుతున్నా... ఇన్‌కమ్ ట్యాక్స్ రోజున నాన్నను గౌరవించినందుకు తమిళనాడు, పుదుచ్చేరిలోని ఆదాయపన్ను శాఖకు కృతజ్ఞతలు' అని పోస్ట్ చేశారు. ఇదిలాఉండగా ఐశ్వర్య షేర్ చేసిన చూసిన పోస్ట్ ను చూసిన సూపర్ స్టార్ ఫాన్స్ పుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Proud daughter of a high and prompt tax payer 😇🏅🌟
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) July 24, 2022
Many thanks to the #incometaxdepartment of Tamilnadu and Puducherry for honouring appa on #incometaxday2022 #onbehalfofmyfather pic.twitter.com/x4timxMDtd
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com