సినిమా

Writing With Fire: ఆస్కార్ రేసులోకి భారతీయ చిత్రం.. నయన్ సినిమాను వెనక్కి నెట్టి..

Writing With Fire: ఆస్కార్ దక్కించుకోవడం, ఆస్కార్ పోటీలో నిలవడం.. సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరి కల.

Writing With Fire: ఆస్కార్ రేసులోకి భారతీయ చిత్రం.. నయన్ సినిమాను వెనక్కి నెట్టి..
X

Writing With Fire: ఆస్కార్ దక్కించుకోవడం, ఆస్కార్ పోటీలో నిలవడం.. సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరి కల. కానీ ఆ కల చాలాసార్లు కలలాగానే మిగిలిపోతూ ఉంటుంది. ప్రపంచంలోనే ప్రతీ భాషలోని మంచి సినిమాలను దాటుకుంటూ ఆస్కార్ టాప్ 15 వరకు చేరడం అంటే మామూలు విషయం కాదు. తాజాగా ఓ భారతీయ సినిమా ఆ ఘనతను దక్కించుకుంది.

ముందుగా పలు తమిళ చిత్రాలు ఆస్కార్ పోటీలకు షార్ట్ లిస్ట్ అయ్యాయి. కానీ చివరికి వచ్చే వరకు ఏ ఒక్కటీ మిగలలేదు. ముందుగా ఇందులో నయనతార నిర్మించిన తమిళ చిత్రం 'కూరంగళ్' చోటు దక్కించుకుంది. కానీ అది టాప్ 15 వరకు రాలేకపోయింది. అనూహ్యంగా ఓ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ టాప్ 15 రేసులో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

జర్నలిజంలో అత్యున్నత స్థాయికి ఎదిగి.. పేరు తెచ్చుకున్న మహిళలు చాలామందే ఉన్నారు. కానీ కేవలం దళిత మహిళలు మాత్రమే కలిసి నిర్వహిస్తున్న ఓ న్యూస్ పేపర్ గురించి మీకు తెలుసా..? దాని పేరే 'ఖబర్ లహరియా'. సామాజిక వర్గ బేధాలు, పురుషాధిక్య సమాజాన్ని ఎదిరించి కొందరు మహిళలు ఈ పత్రికను విజయవంతంగా నడిపిస్తున్నారు. వీరి జీవితాలపై తెరకెక్కిన డాక్యుమెంటరీనే 'రైటింగ్ విత్ ఫైర్'.

సుష్మిత ఘోష్, రింటూ థోమస్ కలిసి ఈ రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఎక్కువగా గుర్తుంపు రాని ఖబర్ లహరియా పత్రిక గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఈ డాక్యుమెంటరీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ టాప్ 15కు చేరుకుంది. ఈ డాక్యుమెంటరీ ఎలాగైనా భారతదేశానికి ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ తీసుకురావాలని చాలామంది కోరుకుంటున్నారు.

Next Story

RELATED STORIES