Rewind Indian Cinema 2020 : విషాదాన్ని మిగిల్చిన 2020!

Rewind Indian Cinema 2020 : విషాదాన్ని మిగిల్చిన 2020!
2020వ సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా, మరికొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు!

2020వ సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా, మరికొందరు బలవన్మరణానికి పాల్పడి అభిమానులకి దిగ్భ్రాంతిని మిగిల్చారు. 2020లో అభిమానులకి దూరం అయిన సినీ తారలను ఓసారి స్మరించుకుందాం!

ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం :

ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం.. అయన లేకపోవడం కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారతీయ సినీ పరిశ్రమకే పెద్దని లోటు. కరోనా బారిన పడిన ఎస్పీబీ.. కరోనా నుంచి కోలుకున్నప్పటికి దీర్ఘకాలిక సమస్యల వలన సెప్టెంబర్ 25న మృతి చెందారు. దాదాపుగా 16 బాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలు.. సింగర్ గానే కాకుండా నటుడుగా, సంగీత దర్శకుడిగా కూడా బాలు మంచి పేరు సంపాదించుకున్నారు.

జయప్రకాశ్ రెడ్డి :

ఓ నటుడు అన్ని సినిమాల్లో ఒకేలా చేస్తే చూసే ప్రేక్షకుడికి కచ్చితంగా బోర్ కొడుతుంది. కానీ ఒకే మ్యానరిజంతో కొన్ని వందల సినిమాలతో మెప్పించారు జయప్రకాశ్‌ రెడ్డి. అలాంటి సీనియర్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ ను తెలుగు ఇండస్ట్రీ ఈ ఏడాదే కోల్పోయింది. గుండెపోటుతో గుంటూరులోని తన నివాసంలో సెప్టెంబర్‌ 8న ఆయన కన్నుమూశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ :

కరోనా తర్వాత దేశవ్యాప్తంగా అంత చర్చనీయాంశంగా మారింది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య.. 2020 జూన్ 14న సుశాంత్‌ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. సుశాంత్ ది ఆత్మహత్యేనని వైద్యులు నిర్ధారించినప్పటికి అదే హత్యనేని సుశాంత్ కుటుంబ సభ్యులు వాదించడంతో ప్రస్తుతం సీబీఐ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.

ఇర్ఫాన్‌ ఖాన్‌ :

న్యూరో ఎండోక్రిన్‌ క్యాన్సర్‌ బారిన పడి ఏప్రిల్ 29న మృతి చెందారు బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రయాణాన్ని అద్వితీయంగా సాగించారు. అలాంటి గొప్ప నటుడిని కూడా భారతీయ చిత్ర పరిశ్రమ ఇదే ఏడాది కోల్పోయింది.

రిషి కపూర్ :

ఐదుదశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో బాలీవుడ్ లవర్‌బోయ్‌గా, రొమాంటిక్ హీరోగా రాణించిన రిషి కపూర్ కూడా ఇదే ఏడాది మృతి చెందారు. క్యాన్సర్‌తో బాధపడుతూ 67ఏళ్ల వయస్సుల్లో ఏప్రిల్‌ 30న మృతి చెందారు.

చిరంజీవి సర్జా :

అప్పుడే కన్నడ సినీ పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న చిరంజీవి సర్జా అకస్మాత్తుగా గుండెపోటుతో జూన్‌ 7న మరణించారు. చిరంజీవి సర్జా మరణించిన సమయనికీ ఆయన భార్య గర్భిణి.

రావి కొండలరావు :

టాలీవుడ్ మోస్ట్ సీనియర్ నటుడు రావి కొండలరావు ఈ ఏడాది జులై 28న కన్నుమూశారు. రంగస్థల నటుడుగా మెప్పించిన రావి కొండలరావు ఆ తర్వాత సిల్వర్ స్కీన్ పైన కూడా రాణించారు. అంతేకాకుండా జర్నలిస్టుగా, ఎడిటర్‌గా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నారు.

సరోజ్‌ఖాన్‌

ఎంతో మంది బాలీవుడ్‌, టాలీవుడ్ నటులను తన నాట్యంతో సెలబ్రెటీలుగా మార్చిన కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ అనారోగ్యంతో జూలై 3న మరణించారు.

వీరు మాత్రమే కాదు బుల్లితెర నటులు కూడా కొందరు అనారోగ్యంతో కన్నుమూయగా, మరికొందరు బలవన్మరణానికి పాల్పడి అభిమానులకి దిగ్భ్రాంతిని మిగిల్చారు.

Tags

Read MoreRead Less
Next Story