pushpa : 'అన్నో.. నేనొచ్చి ఇచ్చేదా ముద్దు'.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు?

pushpa : సినిమాలో ఒక్క డైలాగు చాలు ఇండస్ట్రీలో ఫేమ్ కావడానికి అలా సింగిల్ డైలాగ్‌తో సెలబ్రిటీ అయినవాళ్ళు చాలానే మంది ఉన్నారు.. అలాంటివారి జాబితాలోకి ఈమె కూడా వస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీలో "ఓ అన్నో.. నేనొచ్చి ఇచ్చేదా ముద్దు" అంటూ చెప్పే ఓకే ఒక్క డైలాగుతో ఒక్కసారి సెలబ్రిటీగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదే డైలాగు వినిపిస్తోంది..ఇంతకీ ఎవరీ అమ్మాయి.. ఆమెకి పుష్ప మూవీలో చాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం..
ఆమె పేరు అనష్వి రెడ్డి.. సొంత ఊరు తిరుపతి.. ఐటీ జాబ్ చేసింది. సినిమాలు ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండస్ట్రీకి వచ్చింది. పుష్ప మూవీలో హీరోయిన్ రష్మిక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. సినిమా తిరుపతి నేపధ్యంలోనే ఉండడంతో ఆమెకి అవకాశం రావడానికి మరింత ఈజీ అయింది. అంతేకాదు హీరోయిన్ రష్మికకి చిత్తూరు యాస నేర్పించింది కూడా అనష్వి రెడ్డినే.. ఇక అనష్వి తండ్రి వ్యవసాయంతో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటారు. ఈమెకి ఓ చెల్లెలు కూడా ఉంది. పుష్పలో నటించినందుకు గాను, రష్మికకి చిత్తూరు స్లాంగ్ నేర్పించినందుకు భారీగానే రెమ్యునరేషన్ అందుకుందట.
వాస్తవానికి ఈ మూవీలో ఛాన్స్ వస్తుందని అనష్వి అనుకోలేదట.. డైరెక్టర్ సుకుమార్ తన పాత్రని బాగా డిజైన్ చేశారని, భవిష్యత్తులో మంచి పాత్రలతోనే మెప్పిస్తానని అంటుంది అనష్వి.. ఈ సినిమా కోసం కావాలనే వెయిట్ పెరిగిందట అనష్వి.. అటు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com