సినిమా

Pushpa Movie : పుష్పలో అల్లు అర్జున్ పక్కన చేసిన ఈ కేశవ ఎవరో తెలుసా?

Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Pushpa Movie :  పుష్పలో అల్లు అర్జున్ పక్కన చేసిన ఈ కేశవ ఎవరో తెలుసా?
X

Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు బయటకు వచ్చాక అల్లు అర్జున్ తర్వాత అతని పక్కన మచ్చ అనుకుంటూ నటించిన కేశవ గురించే మాట్లాడుకుంటారు.


అతని అసలు పేరు జగదీష్ ప్రతాప్ బండారి.. పుష్పకి ముందు మల్లేశం, పలాస 1978 అనే సినిమాలో కూడా నటించాడు కానీ పెద్దగా ఫేం కాలేదు.. కానీ పుష్పలో అతనికి ఫుల్ లెంగ్త్ రోల్ పడింది. సినిమాలో బన్నీ తర్వాత ఎక్కువగా కనిపించేంది అతనే కావడం విశేషం. పక్కా చిత్తూరు యాసలో మాట్లాడుతూ, చాలా సహజంగా చేశాడు ఆ పాత్ర.


అతనికి బాష మీద మంచి పట్టుఉండడంతో ఆ పాత్రకి అతన్నే తీసుకున్నారు సుకుమార్.. సినిమాలో కేశవగా నటించడమే కాదు.. సినిమాకి నెరేషన్ ఇచ్చింది కూడా అతనే కావడం మరో విశేషం. మరి ఈ సినిమా తర్వాత అతనికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Next Story

RELATED STORIES