సినిమా

Akkineni Nagarjuna :నాగార్జునతో హిట్ పెయిర్ అనిపించుకోలేకపోయిన ఆ హీరోయిన్...!

Akkineni Nagarjuna : ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనేవి కొన్ని ఉంటాయి.. వీరి కాంబినేషన్‌‌లో ఎన్ని సినిమాలు వచ్చిన సరే చూడడానికి అభిమానులు ఎప్పుడు ఇష్టపడుతునే ఉంటారు..

Akkineni Nagarjuna :నాగార్జునతో హిట్ పెయిర్ అనిపించుకోలేకపోయిన ఆ హీరోయిన్...!
X

Akkineni Nagarjuna : ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అనేవి కొన్ని ఉంటాయి.. వీరి కాంబినేషన్‌‌లో ఎన్ని సినిమాలు వచ్చిన సరే చూడడానికి అభిమానులు ఎప్పుడు ఇష్టపడుతునే ఉంటారు.. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఫెయిల్ అయిపోతుంటాయి. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కాంబినేషన్ నాగార్జున, శోభన... మొత్తం వీరు జంటగా మూడు సినిమాలు తెరకెక్కాయి. నాగార్జున, శోభన కాంబినేషన్‌‌లో వచ్చిన మొదటి చిత్రం విక్రమ్.

ఈ సినిమాకి వి. మధుసూదనరావు దర్శకత్వం వహించారు. ఇది నాగార్జునకి మొదటిచిత్రం కూడా.. 1986లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌‌లో వచ్చిన రెండో చిత్రం నేటి సిద్ధార్థ.. 1990లో క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్స్‌‌ఆఫీస్ వద్ద ఓ మోస్తరుగా నడిచింది. ఇక చివరగా వీరి కాంబినేషన్‌‌లో వచ్చిన చిత్రం రక్షణ.. ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1993 లో విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించలేదు.

Next Story

RELATED STORIES