ANR : ఆ పాత్రకి అక్కినేని నో అంటే వేటూరితో వేయించేవారట..!

ANR : ఆ పాత్రకి అక్కినేని నో అంటే వేటూరితో వేయించేవారట..!
ANR : తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ హృదయానికి హత్తుకొనే సినిమాలు మాత్రం కొన్నే వచ్చాయి.

ANR : తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ హృదయానికి హత్తుకొనే సినిమాలు మాత్రం కొన్నే వచ్చాయి.. అలాంటి కొన్ని సినిమాలలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది లెజెండరీ నటుడు అక్కినేని నటించిన సీతారామయ్యుగారి మనవరాలు.. నవ్వినా కన్నీళ్ళే అనే నవలను స్క్రీప్ట్ గా మార్చి సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు క్రాంతికుమార్‌.

ఇందులో సీతారామయ్యు పాత్రని అయితే ఎన్టీఆర్ లేదా అక్కినేనితో వేయించాలని అనుకున్నారు క్రాంతికుమార్‌.. కానీ ఎన్టీఆర్ అప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండడంతో సినిమాలు చేయడం లేదు... దీనితో అక్కినేనిని అప్రోచ్ కావాలని అనుకున్నారు క్రాంతికుమార్.. కానీ తాత పాత్ర ఆయన చేస్తారో లేదో అని అనుమానంతోనే అక్కినేని అడిగారాయన. ఆయన ఒప్పుకోకపోతే వేటూరితో ఎలాగైనా ఆ పాత్రను చేయించాలని ఫిక్స్ అయ్యారు క్రాంతికుమార్‌.

కానీ అక్కినేని ఒప్పుకున్నారు. ఇలాంటి పాత్రలు హీరోలకి ధీటుగా ఉంటాయని ఎంతో ఇష్టంతో చేశారు అక్కినేని.. విగ్గు లేకుండా అస్సలు నటించని అక్కినేని... ఈ సినిమాకోసం మొదటిసారి విగ్గును కూడా పక్కనపెట్టి చేశారు. సినిమా మొత్తం పంచెకట్టుతో కనిపిస్తారాయన. హీరోయిన్ గా మీనాకి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. సీతారామయ్యుగా అక్కినేనిని తప్ప మరొకరిని ఊహించుకోలేము.. ఆయన మనవరాలుగా మీనా నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

సంక్రాంతి కానుకగా 1991లో రిలీజైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక్కడో విశేషం ఏంటంటే.. వేటూరితో ఈ సినిమా తీయకపోయిన ఆయనతో అన్ని పాటలు రాయించుకున్నారు దర్శకుడు క్రాంతికుమార్‌. ఆయన రాసిన పూసింది పూసింది పున్నాగా, కూసింత నవ్వింది నీలాగ ఇప్పటికి ఎవర్ గ్రీన్.

Tags

Read MoreRead Less
Next Story