Bigg Boss Lobo : లోబోకి ఎందుకంత క్రేజ్...?

Bigg Boss Lobo :  లోబోకి ఎందుకంత క్రేజ్...?
Bigg Boss Lobo : బిగ్‌‌బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లోకి అనూహ్యంగా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు లోబో.. వాస్తవానికి అయితే గత సీజన్ లోనే లోబో బిగ్‌‌బాస్ లోకి అడుగుపెట్టాల్సింది.

Bigg Boss Lobo : బిగ్‌‌బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లోకి అనూహ్యంగా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు లోబో.. వాస్తవానికి అయితే గత సీజన్ లోనే లోబో బిగ్‌‌బాస్ లోకి అడుగుపెట్టాల్సింది.. కానీ అప్పుడు ఆ అవకాశం మిస్ అవ్వగా ఈ సారి దక్కింది. ఈ సీజన్‌‌లో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు లోబో.. లోబో అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికి ఇష్టమే.. దానికి కారణం చిత్రవిచిత్రంగా కనిపించడమే.

హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు అంతా వింతవింతగా ఉంటుంది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే లోబో మాట్లడే పద్దతి ఒకలాగే ఉంటుంది. అందులో తేడా ఉండదు. ఏదైనా ఓపెన్ గా ఉండడం లోబో స్పెషాలిటీ. ముక్కుసూటిగా మాట్లాడడం అతని నేచర్.. లోబో పక్కా హైదరాబాదీ కావడం అందరిని ఇంకాస్త దగ్గరికి చేసింది. సెలబ్రిటీలకి కూడా లోబో అంటే ఓ క్రేజ్ అనే చెప్పాలి.

లోబో అసలు పేరు మహమ్మద్‌ ఖయ్యూం. స్కూల్ టైంలో దొంగతనం చేసి దొరికిపోవడంతో తొమ్మిదే తరగతికే టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశారు. దీనితో మధ్యలోనే చదువును ఆపేశాడు. ఆ తర్వాత ఓ టాటూ షాపులో పనిచేశాడు. అక్కడ ఓ రష్యన్‌ యువతికి తొలి టాటూ వేశాడు. లోబో కట్టుబొట్టు అంతా విచిత్రంగా ఉండడంతో ఆ యువతి అతనికి లోబో అనే పేరు పెట్టేసింది. దీనితో అప్పటినుంచి మహమ్మద్‌ ఖయ్యూం కాస్త లోబోగా మారిపోయాడు. మొదట్లో లోబోని చూసి అంతా షాక్ అయ్యేవారట. ఏంటి ఇలా ఉన్నాడని అనుకునేవారట. ఒక్కోసారి అవమానించేవారట కూడా. కానీ ఇవేం పట్టించుకోకుండా తనని తానూ నమ్ముకొని ముందుకు వెళ్ళేవాడట.

లోకల్ బాయ్ లోబోకి బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటే పిచ్చి ఇష్టం.. ఆమెను కలిసేందుకు ముంబై కూడా వెళ్ళాడట.. అక్కడ పడరాని కష్టాలు పడ్డాడు.. కానీ అమెను కలవలేదు కూడా... ఆ తర్వాత మా మ్యూజిక్ లో అవకాశం రావడంతో అక్కడ యాంకర్ గా ఫేమస్ అయ్యాడు. అక్కడే ఫ్యాన్ బేస్ కూడా వీపరితంగా పెరిగింది. దీనితో మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. పూరీ డైరెక్షన్ లో వచ్చిన బాచీలో మొదటిసారి కనిపించాడు. ఇప్పుడు బిగ్‌‌బాస్ లోకి అడుగుపెట్టి మరింత ఫేమ్ సంపదిచుకున్నాడు. మరి వచ్చిన ఈ ఫేమ్ లోబో ఎలా మలుచుకుంటాడో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story