Chiranjeevi : చిరంజీవి ఫ్లాప్ సినిమాకి చిరంజీవి హిట్ సినిమానే కారణం..!

Chiranjeevi :  చిరంజీవి ఫ్లాప్ సినిమాకి చిరంజీవి హిట్ సినిమానే కారణం..!
Chiranjeevi : ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి రకరకాల కారణాలుంటాయి. అందులో ఆ సినిమాకి పోటీగా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఓ కారణమై ఉంటుంది.

Chiranjeevi : ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి రకరకాల కారణాలుంటాయి. అందులో ఆ సినిమాకి పోటీగా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఓ కారణమై ఉంటుంది. అయితే అలా పోటీగా వచ్చే సినిమాలు వేరే హీరోల సినిమాలై ఉంటాయి. కానీ చిరంజీవి విషయంలో మాత్రం చాలా విచిత్రంగా ఆయన సినిమాకి ఆయనే సినిమానే పోటీగా నిలిచింది. ఇది 1983లో జరిగింది.

చిరంజీవిని స్టార్ హీరోగా, మాస్ హీరోగా ప్రేక్షకుల్లో నిలబెట్టిన చిత్రం ఖైది.. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్‌‌‌లో వచ్చిన ఆరో చిత్రం ఇది.. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని స్టార్ దర్శకుడిని చేసింది ఈ చిత్రం. హీరోగా చిరంజీవికి ఇది 62వ చిత్రం కావడం విశేషం.. ఇందులో మాధవి, సుమలత హీరోయిన్‌‌‌గా నటించారు. ఇక ఈ సినిమా సృష్టించిన వసూళ్ళు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ హిట్‌‌‌గా నిలిచి సరికొత్త రికార్డులను సృష్టించింది.

అయితే ఈ సినిమా వచ్చిన వారం రోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన మంత్రి గారి వియ్యంకుడు చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి బాపు దర్శకుడు. మనవూరి పాండవులు తరువాత మళ్ళీ బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా ఇదే. ఇది ఒక మలయాళం సినిమాకు రీమేక్ కావడం విశేషం. బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి కమర్షియల్ మూవీ ఇదే .. ముందుగా ఈ సినిమాకి కేవీ మహదేవన్‌‌ని సంగీత దర్శకుడిగా అనుకున్నారు.

అయితే చిరంజీవి, ఇళయరాజా సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో ఫైనల్‌‌గా ఇళయరాజాను తీసుకున్నారు. బాపు, ఇళయరాజా కాంబినేషన్‌‌‌లో వచ్చిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి వెంకట్రావు ఓ చిన్న పాత్రలో నటించారు. కానీ చిరంజీవికి ఆయనకి మధ్య ఒక్క సన్నివేశం కూడా ఉండదు. మొత్తం ఆరు కేంద్రాలలో ఈ సినిమా యాబై రోజులు పూర్తి చేసుకుంది.

అయితే ఈ ఖైది చిత్రం విడుదలైన వారం రోజులకే ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.

Tags

Read MoreRead Less
Next Story