Director Teja : స్పెషల్ ఫ్లైట్, హోటల్ కావాలన్న మోడల్.. ఆమెని కాదని బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ..!

Director Teja : స్పెషల్ ఫ్లైట్, హోటల్ కావాలన్న మోడల్.. ఆమెని కాదని బ్లాక్ బస్టర్ కొట్టిన తేజ..!
Director Teja : దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కొత్తకొత్త వాళ్ళతో వండర్స్ క్రియేట్ చేస్తాడు. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలుండరు..

Director Teja : దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కొత్తకొత్త వాళ్ళతో వండర్స్ క్రియేట్ చేస్తాడు. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలుండరు.. భారీ సెట్లు ఉండవు.. ఆర్బాటలతో లోకేషన్స్ ఉండవు.. అంతా కధే నడిపిస్తుంది. కెరీర్ తొలినాళ్ళలో మాములు బడ్జెట్‌‌తో ఆదరిపోయే హిట్స్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు తేజ.. అందులో భాగంగానే ఆయన నుంచి వచ్చిన చిత్రం "నువ్వు నేను". తేజ మూడో చిత్రం ఇది..

చిత్రం సినిమా సక్సెస్‌‌ని బాగా ఎంజాయ్ చేస్తున్న తేజకి.. వెంకటేష్‌‌తో ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. కానీ అదెందుకో మధ్యలోనే ఆగిపోయింది. దీనితో మరో కథని చేద్దామని అనుకున్నాడు తేజ. దానికి మాధవన్, సుమంత్ లను హీరోలుగా అనుకోని అప్రోచ్ కూడా అయ్యాడు. కానీ అవి కూడా వర్కౌట్ కాలేదు. దీనితో మళ్ళీ చిత్రం సినిమాని చేసిన ఉదయ్ తోనే ఈ సినిమాని ఫైనల్ చేశాడు తేజ.

హీరోయిన్ కోసం ఆడిషన్స్ పెట్టాడు. ఓ ముంబాయి నుంచి వచ్చిన ఓ మోడల్‌‌ను సెలెక్ట్ చేశాడు. ఆమె మాత్రం స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హోటల్ కావాలంటూ బిల్డప్ ఇచ్చిందట. ఇది నచ్చకపోవడంతో ఆడిషన్స్‌‌కి వచ్చిన వారిలో నీకు ఎవరు లీస్ట్ అనిపిస్తున్నారని ఆమెనే అడిగాడట తేజ. ఆమె ఎదో క్యాజువల్‌గా ఒకమ్మాయి వైపు వేలు చూపించిందట. నువ్వింక వెళ్లొచ్చు ఆమె నా హీరోయిన్ అని చెప్పాడట తేజ. ఆమెనే అనిత.

హైదరాబాదు, ముంబై, వికారాబాద్‌‌లో మొత్తం సినిమా షూటింగ్ చేశారు. సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసి ఆగస్టు 10, 2001లో రిలీజ్ చేశారు. ఫస్ట్ షో నుంచే సినిమాకి అదిరిపోయే టాక్ వచ్చింది. మొత్తం ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్.. యూత్ మొత్తం ధియేటర్లలోనే ఉన్నారు. దాదాపుగా కోటి యాబై లక్షలతో ఈ సినిమాని తెరకెక్కిస్తే ఏకంగా 20 కోట్ల వరకూ సాధించిపెట్టింది ఈ సినిమా.

Tags

Read MoreRead Less
Next Story