సినిమా

Shyam Singha Roy : శ్యామ్‌‌సింగరాయ్ విలన్ .. ఆ పాత్రలకి ఇతగాడే ఫేమస్..!

Shyam Singha Roy : హీరో నాని ద్విపాత్రాభినయంలో, సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం శ్యామ్‌‌సింగరాయ్...

Shyam Singha Roy : శ్యామ్‌‌సింగరాయ్ విలన్ .. ఆ పాత్రలకి ఇతగాడే ఫేమస్..!
X

Shyam Singha Roy : హీరో నాని ద్విపాత్రాభినయంలో, సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం శ్యామ్‌‌సింగరాయ్... పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి వసూళ్ళతో ఈ సినిమా ముందుకు దూసుకుపోతోంది. అయితే సినిమాలో మహంత్ అనే పాత్రలో విలన్ గా నటించాడు మనీష్ వాధ్వా.


సినిమాలో అతను కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ అతని పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది. 1972లో ముంబైలో జన్మించిన మనీష్ వాధ్వా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత బుల్లితెర నటుడుగా మారాడు. ఎక్కువగా ఆయన చాణక్యుడు పాత్రలతో ఫేమస్ అయ్యాడు. ఆ పాత్రలలో ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేము కూడా..అంతగా ఆ పాత్రకి సూట్ అవుతడాయన.


చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లలో నటించి నటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో వచ్చిన మణికర్ణిక, పద్మవత్ సినిమాలలో నటించాడు. ఆ తర్వాత శ్యామ్‌‌సింగరాయ్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్‌లో పనిచేయాలనేది తన కల అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మనీష్ వాధ్వా.. శ్యామ్‌‌సింగరాయ్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే తెలుగులో మరో సినిమా అవకాశం వచ్చిందని, సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు.

Next Story

RELATED STORIES