సినిమా

Jacqueline Fernandez: నేరస్థుడితో ప్రేమలో పడిన బాలీవుడ్ బ్యూటీ.. ఫోటో వైరల్..

Jacqueline Fernandez: ప్రస్తుతం ఏ భాషా సినీ పరిశ్రమలో అయినా ప్రేమ వ్యవహారాలు చాలా కామన్‌గా కనిపిస్తున్నాయి.

Jacqueline Fernandez: నేరస్థుడితో ప్రేమలో పడిన బాలీవుడ్ బ్యూటీ.. ఫోటో వైరల్..
X

Jacqueline Fernandez: ప్రస్తుతం ఏ భాషా సినీ పరిశ్రమలో అయినా ప్రేమ వ్యవహారాలు చాలా కామన్‌గా కనిపిస్తున్నాయి. అంతే కాదు డేటింగ్ కల్చర్ కూడా అక్కడ చాలా ఎక్కువ. సాధారణంగా హీరోయిన్లు.. తమ సహ నటులతోనో లేదా బిజినెస్ మ్యాన్‌లతోనో ప్రేమలో పడతారు. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీ మాత్రం ఒక నేరస్థుడిని ప్రేమిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా వీరి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

జాక్విలిన్ ఫెర్నాండెస్.. హిందీలో ఇప్పటికే యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్. హిందీ మాత్రమే కాదు ఇప్పుడిప్పుడే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తోంది. అయితే బాలీవుడ్‌లో జాక్విలిన్ పర్సనల్ లైఫ్‌పై పెద్దగా వివాదాలు ఏమీ లేవు. కానీ తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఓ ఫోటో పలు వివాదాలకు దారితీస్తోంది.

ఛీటింగ్ కేసులో తీహార్ జైలులో శిక్షను కూడా అనుభవించిన వ్యక్తి సుఖేష్ చంద్రశేఖర్. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 100 మంది దగ్గర 75 కోట్లు సొమ్మును తీసుకున్నాడు. ఆ సమయంలో సుఖేష్‌తో పాటు జాక్విలిన్ కూడా ఈ మోసాలలో పాలుపంచుకుందని విచారణ చేపట్టారు. కానీ అందులో జాక్విలిన్ నిర్దోషి అని తేలింది. అంతే కాక వీరిద్దరు ప్రేమలో ఉన్నారన్న వార్తలను కూడా జాక్విలిన్ కొట్టిపారేసింది.

సుఖేష్ బెయిల్‌పై బయటికి వచ్చినా తనపై కేసు అలాగే ఉంది. అయితే సుఖేష్‌ను ప్రేమిస్తున్న వార్త నిజం కాదన్న జాక్విలిన్.. తనతో క్లోజ్‌గా ఓ ఫోటో దిగింది. ఇందులో సుఖేష్.. జాక్విలిన్ బుగ్గపై ముద్దు పెడుతుండగా ఆమె సిగ్గుపడుతోంది. ఇక ఈ ఫోటో ఇప్పటికే వైరల్ అవ్వడంతో.. జాక్విలిన్ మరిన్ని వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES