సినిమా

పవన్ సినిమా నుంచి జాక్వెలిన్‌ అవుట్... ఆమె స్థానంలో హాట్ బ్యూటీ..!

పవర స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో 'హరి హర వీర మల్లు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

పవన్ సినిమా నుంచి జాక్వెలిన్‌ అవుట్... ఆమె స్థానంలో హాట్ బ్యూటీ..!
X

పవర స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో 'హరి హర వీర మల్లు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకి బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు మేకర్స్.. ఈ క్రమంలో ఆమెపై ఓ కేసులో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశం విడిచి వెళ్లకుండా కూడా ఈడీ ఆదేశాలు ఇచ్చింది. దీనితో ఆమెను పవన్ చిత్రం నుంచి తోలిగించినట్టుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తల పైన దర్శకుడు క్రిష్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేవలం డేట్స్‌ ఇష్యూ వల్లే జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఈ సినిమా చేయలేకపోయిందని తెలిపాడు. ఆమె స్థానంలో మేం నర్గిస్‌ ఫక్రిని ఎంపిక చేసినట్టుగా క్రిష్ తెలిపాడు. మొఘల్‌ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్‌ ఫక్రి కనిపించనుంది. కాగా ఈ సినిమా 17 వ శతాబ్దానికి చెందిన కథతో తెరకెక్కుతుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Next Story

RELATED STORIES