సినిమా

Jai Bhim: జై భీమ్ కొత్త రికార్డ్.. ప్రపంచ సినిమాల్లోనే ఫస్ట్ ప్లేస్..

Jai Bhim: సూర్య హీరోగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా చూసిన ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Jai Bhim (tv5news.in)
X

Jai Bhim (tv5news.in)

Jai Bhim: సూర్య హీరోగా తెరకెక్కిన 'జై భీమ్' సినిమా చూసిన ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. చూసిన ప్రతీ ఒక్కరు దీనిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ సినిమాలో సూర్యకంటే ఎక్కువగా ప్రశంసలు పొందుతున్నారు లిజోమోల్ జోస్, మణికంఠ. అయితే జై భీమ్ కేవలం ప్రశంసలనే కాదు రికార్డులను కూడా సొంతం చేసుకుంటోంది.

జై భీమ్ చూసిన ప్రతీ ఒక్కరు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసుంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. కానీ నేరుగా ఓటీటీలో విడుదల చేసినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం ఆపలేదు. కేవలం మౌత్ టాక్‌తోనే జై భీమ్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సంపాదించింది. అంతే కాక తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును దక్కించుకుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్‌లలో ఇప్పటివరకు పెద్దగా ఇండియన్ సినిమాలు ఫస్ట్ ప్లేస్‌ను సాధించలేకపోయాయి. కానీ మొదటిసారిగా జై భీమ్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. 9.6 రేటింగ్‌ను సాధించి మిగతా సినిమాలు అన్నింటిని వెనక్కి నెట్టింది. ఐఎమ్‌డీబీ రేటింగ్‌లలో సూర్య రికార్డు సాధించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా సూర్య నటించిన 'సూరరాయ్ పొట్రు' అంటే 'ఆకాశమే నీ హద్దురా' ఐబీడీబీ రేటింగ్‌లలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది.

ఇప్పుడు తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ తన సినిమాను ఐఎమ్‌డీబీ రేటింగ్‌లలో మొదటి స్థానంలో నిలబెట్టాడు సూర్య. జై భీమ్ తర్వాత స్థానాల్లో 9.3 రేటింగ్‌తో 'శశాంక్ రిడప్షన్', 9.2 రేటింగ్‌తో 'గాడ్ ఫాధర్' నిలిచాయి. దీంతో జై భీమ్ సినిమాను ఆదరించిన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES