Kalanithi Maran : 300మంది 'జైలర్' సిబ్బందికి బంగారు నాణేల బహూకరణ

Kalanithi Maran : 300మంది జైలర్ సిబ్బందికి బంగారు నాణేల బహూకరణ
'జైలర్' సిబ్బందిని సత్కరించిన సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' ఇప్పటికే ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం ఇప్పటికే 500 కోట్ల రూపాయల మార్క్‌ను దాటింది. ఇదిలా ఉంటే, సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్, ఈ సినిమా కోసం పని చేసిన 300 మందికి పైగా సిబ్బందికి బంగారు నాణేలను బహుమతిగా అందించారు.

సినిమా కోసం పనిచేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీడియా సమ్మేళనం సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అయిన 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ సెప్టెంబర్ 10న వారికి బంగారు నాణెం అందించాలని నిర్ణయించుకున్నారు. సినీ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా పంచుకున్నారు. “బ్రేకింగ్: కళానిధి మారన్ ఈ రోజు జైలర్ కోసం పనిచేసిన 300 మందికి పైగా బంగారు నాణేలతో సత్కరించారు" అని ఆయన వీడియోకు క్యాప్షన్ ను జోడించారు.

అంతకుముందు, సినిమా విజయాన్ని పురస్కరించుకుని, చిత్ర నిర్మాత కళానిధి మారన్, రజనీకాంత్‌కు BMW X7, దర్శకుడు నెల్సన్‌కు పోర్షే కారును గత వారం సెప్టెంబర్ 1న బహుమతిగా ఇచ్చారు. సెప్టెంబర్ 4న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కి కూడా మారన్ 1.5 కోట్ల రూపాయల విలువైన సరికొత్త పోర్షే కారును బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రొడక్షన్ బ్యానర్ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్, యూట్యూబ్ ఛానెల్‌లోనూ షేర్ చేశారు. "భారీ బ్లాక్‌బస్టర్ జైలర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి శ్రీ కళానిధి మారన్ అనిరుధ్ కు సరికొత్త పోర్షే కారు కీని అందించారు" అని రాసుకువచ్చారు. ఈ క్లిప్‌లో, అనిరుధ్‌కు మూడు లగ్జరీ కార్లలో ఒకదాన్ని ఎంచుకోవడానికి ఒక ఎంపిక ఇవ్వబడింది. అతను తన సొగసైన కార్ల సేకరణకు సరికొత్త పోర్ష్‌ను జోడించాడు. రజనీకాంత్ మేనల్లుడు అనిరుధ్ 'జైలర్' కోసం 'కావలా', 'హుకుం', 'రథమారే' వంటి చార్ట్‌బస్టర్ పాటలను అందించారు.

గత నెలలో థియేటర్లలో విడుదలైన రజనీకాంత్ 'జైలర్' అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ చిత్రం ఇప్పుడు రజనీ స్వంత '2.0' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ ఇప్పుడు 'తలైవర్ 171'లో కనిపించనున్నారు. ఇది అతని రాబోయే చిత్రానికి తాత్కాలిక టైటిల్. ఈ ప్రాజెక్ట్‌కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story