సినిమా

janhvi kapoor : రెండు రోజుల వేడుక.. చెన్నైలో సంగీత్.. తిరుపతిలో కళ్యాణం: జాన్వీ కపూర్

ప్రతి వ్యక్తికి పెళ్లి జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. ఆరోజు కోసం అమ్మాయిలు, అబ్బాయిలు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. సెలబ్రెటీలు సైతం ఇందుకు మినహాయింపు కాదు.

janhvi kapoor : రెండు రోజుల వేడుక.. చెన్నైలో సంగీత్.. తిరుపతిలో కళ్యాణం: జాన్వీ కపూర్
X

janhvi kapoor : ప్రతి వ్యక్తికి పెళ్లి జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. ఆరోజు కోసం అమ్మాయిలు, అబ్బాయిలు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. సెలబ్రెటీలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ తన పెళ్లికి పెద్ద ప్లానే సెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావించింది.

తాను చేసుకోబోయే వరుడు చాలా తెలివిగల వాడై ఉండాలంటోంది. ఇంకా పెళ్లి చాలా సింపుల్‌గా రెండు రోజులు చేసుకుంటానంటోంది. బ్యాచిలర్ పార్టీ కాప్రీ ఐలాండ్‌లో చేసుకుంటే, పెళ్లికి ముందు ఏర్పాటు చేసే సంగీత్ కార్యక్రమాన్ని అమ్మ తిరుగాడిన ఇల్లు చెన్నైలోని మైలాపూర్‌లో, వివాహం శ్రీవారి సన్నిధి అయిన తిరుపతిలో చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇంకా పెళ్లికి దక్షిణాది చీర ధరించాలనేది తన కోరిక అని వివరించింది ఈ బాలీవుడ్ బ్యూటీ.జాన్వీ సినీ నిర్మాత బోనీ కపూర్ మరియు దివంగత నటుడు శ్రీదేవి కుమార్తె. ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఫీచర్‌లో భాగంగా, ఆమె తన భవిష్యత్తు పెళ్లి గురించి, అది ఎలా ఉండాలో ఊహించుకుంటోంది. ఆమె రిసెప్షన్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది.

తన తోడిపెళ్లికూతురు విషయానికొస్తే, స్నేహితురాలు తనిషా సంతోషి , సోదరి ఖుషీ కపూర్, మరో సోదరి అన్షులా పాల్గొనడానికి ఇష్టపడుతున్నానని చెప్పింది. వివాహ సమయంలో చెల్లి ఖుషీ, తండ్రి చాలా 'భావోద్వేగానికి' గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సమయంలో అన్షులా ఉంటే ప్రతి విషయాన్ని పర్యవేక్షిం నాన్నని ఊరడిస్తుందని జాన్వి ఆశిస్తోంది.ఆమె తన పెళ్లికి కాంజీవరం లేదా పట్టు పావడను ధరిస్తానని, అది బంగారం మరియు దంతపు నేపథ్యంతో ఉంటుందని కూడా ఆమె వెల్లడించింది. మెహందీ దుస్తులు గులాబీ రంగులో ఉంటాయని, సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన దుస్తులు పసుపు రంగులో ఉంటాయి అని వివరించింది.

కాగా, జాన్వీ 2018 లో ధడక్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో జోయా అక్తర్ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. గత సంవత్సరం, ఆమె గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్‌లో కనిపించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించిన గుడ్ లక్ జెర్రీ చిత్రీకరణను పూర్తి చేసింది. మరో చిత్రం దోస్తానా 2లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story

RELATED STORIES