సినిమా

Janhvi Kapoor: తమిళ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ ప్రమోషన్స్.. ఏంటో సంగతి..?

Janhvi Kapoor: తెలుగు ఇండస్ట్రీకే కాదు.. మొత్తం సినీ పరిశ్రమకే అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది శ్రీదేవి.

Janhvi Kapoor (tv5news.in)
X

Janhvi Kapoor (tv5news.in)

Janhvi Kapoor: తెలుగు ఇండస్ట్రీకే కాదు.. మొత్తం సినీ పరిశ్రమకే అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుంది శ్రీదేవి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుండి తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేసిన శ్రీదేవి.. ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించి వెళ్లిపోయింది. అలాంటి శ్రీదేవి తన కూతుళ్లు జాన్వీ, ఖుషీలను హీరోయిన్లుగా చూడాలని చాలా ఆశించింది. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నూమూసింది.

శ్రీదేవి మరణం తర్వాత తన వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తన తండ్రి సాయంతో, బాలీవుడ్‌లోని మరికొందరి సపోర్ట్‌తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఇప్పుడిప్పుడే మంచి స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. శ్రీదేవి కూతురు అనే మార్క్ తనపై పడిపోయింది. అయితే కొంతకాలం క్రితం సౌత్‌లో కూడా అడుగుపెట్టాలన్న ప్లాన్‌లో ఉన్నదట జాన్వీ.

సూపర్ స్టార్ మహేశ్‌తో, ఎన్‌టీఆర్‌తో జాన్వీ కపూర్ సినిమాలు చేయనుందని అప్పట్లో విపరీతంగా రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అవేవి నిజాలు కాదని తేలిపోయింది. పైగా జాన్వీ తండ్రి బోణీ కపూర్ కూడా తనను సౌత్‌కు పంపడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం ఓ రూమర్ తెరపైకి వచ్చింది.

అజిత్ హీరోగా, తెలుగు హీరో కార్తికేయ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'వాలిమై'. 'నేర్కొండ పార్వై' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హెచ్ వినోథ్‌కు వాలిమైతో మరో అవకాశాన్ని అందించాడు అజిత్. అయితే ఈ చిత్రాన్ని బోణీ కపూర్ నిర్మిస్తున్నాడు.


వాలిమై చిత్రానికి మూవీ టీమ్ కంటే జాన్వీనే ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తోంది. అందుకు జాన్వీ ఈ సినిమాలో నటిస్తుందా ఏంటి అన్న అనుమానాలు మొదలయ్యాయి. తన తండ్రి నిర్మిస్తున్న సినిమా కాబట్టి ప్రమోషన్స్ చేస్తుందా? లేదా వాలిమైతో జాన్వీ సౌత్‌లో అడుగుపెట్టనుందా అనే విషయం తేలాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే అనుకుంటున్నారు బీ టౌన్ ప్రేక్షకులు.

Next Story

RELATED STORIES