Jawan: రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి హిందీ చిత్రం

Jawan: రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి హిందీ చిత్రం
మరో రికార్డు సృష్టించిన జవాన్.. రూ.1,100కోట్లు వసూలు

షారుఖ్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన 'జవాన్', థియేటర్లలో విడుదలై 30 రోజుల తర్వాత కూడా ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసి మరో రికార్డు సాధించింది. ఈ ఫీట్‌తో ఈ మైలురాయిని సాధించిన ఏకైక హిందీ చిత్రంగా కూడా జవాన్ నిలిచింది. దేశీయ బాక్సాఫీస్ నుండి 733.37 కోట్ల రూపాయల సహకారంతో దాని మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ప్రస్తుతం రూ.1,103.27 కోట్లుగా ఉంది. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ నుండి 369.90 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అక్టోబర్ 6న సాయంత్రం రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తన సోషల్ మీడియా ఖాతాలలో చిత్రం బాక్సాఫీస్ గణాంకాలను పంచుకుంది. ''జవాన్.. ప్రతిరోజూ బాక్సాఫీస్ రికార్డులను సృష్టిస్తోంది, బద్దలు చేస్తోంది'' అంటూ ప్రశంసలు గుప్పించింది. 'జవాన్' అనేది 'పఠాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్ రెండవ భారీ ఆఫర్. ఇది కూడా మెగా-బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చలనచిత్రాల జాబితాలో టాప్ 3లో ఉంది.

'జవాన్' సినిమా గురించి

అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'పఠాన్' తర్వాత ఈ సంవత్సరంలో విడుదలైన షారుక్ ఖాన్ రెండవ మూవీ. 'జవాన్‌'లో నయనతార, విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్ , ప్రియమణి, సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందినట్టు సమాచారం.

ఈ చిత్రం ముందుగా జూన్‌లో సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే ప్రధానంగా విజువల్ ఎఫెక్ట్‌లతో కూడిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో ఉన్నందున రెండు నెలల పాటు వాయిదా పడింది. బాక్సాఫీస్ వద్ద దాని పనితీరు విషయానికొస్తే 'జవాన్' ప్రపంచవ్యాప్తంగా స్థూల కలెక్షన్లలో ప్రతిష్టాత్మకమైన రూ. 1,000 కోట్ల మార్కును దాటిన సంవత్సరంలో SRK రెండవ చిత్రంగా నిలిచింది.


Tags

Read MoreRead Less
Next Story