Jawan song Zinda Banda: 'జిందా బందా'తో దుమ్ము దులిపేసిన షారుఖ్

Jawan song Zinda Banda: జిందా బందాతో దుమ్ము దులిపేసిన షారుఖ్
జవాన్ నుంచి అదిరిపోయే 'జిందా బందా' వీడియో సాంగ్ రిలీజ్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పటికే 'పఠాన్'తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు షారుఖ్ 'జవాన్'తో తిరిగి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలోని మొదటి పాట తాజాగా విడుదలైంది. 'జవాన్‌'లో షారుక్‌ను చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 'జిందా బందా' విడుదల కావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెటిజన్లు ఈ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక జిందా బ్యాండ్‌ని అనిరుధ్ కంపోజ్ చేసి పాడారు. ట్రాక్‌లోని ఇన్ఫెక్షియస్ ఎనర్జీని ఎలివేట్ చేసిన ప్రఖ్యాత శోబి ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.

ఈ సినిమాలోని పాటలను ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్న ఇర్షాద్ కమిల్ రాశారు. ఈ పాట ఇప్పుడు అన్ని ప్రధాన సంగీత వేదికలపై హిందీ (జిందా బందా), తమిళం (వంధా ఎడం), తెలుగు (దుమ్మే ధూళిపేలా)లో అందుబాటులో ఉంది. ఇక తాజాగా రిలీజైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి సర్వత్రా మంచి ఆదరణ వస్తోంది. ముఖ్యంగా షారుఖ్‌ ఖాన్‌ నటనను ప్రజలు ఆదరిస్తున్నారు. పాటలో సూపర్ స్టార్ ఎనర్జీ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. అతని అద్భుతమైన నృత్యాలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి. జిందా బందా ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. షారుఖ్ హై లెవల్ ఫర్ఫామెన్స్ కు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు దీన్ని వారు చార్ట్ బస్టర్‌గా ప్రకటించారు.

ప్రస్తుతం మూడు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ పాట విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దుమ్మే దులిపేలా’ అంటూ మాంచి సౌత్ బీట్‌తో నిజంగానే దుమ్ము దులిపారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌తో ‘తేరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. నయనతార హీరోయిన్. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక దీపికా పదుకొనె ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ సహ నిర్మాత.

మూడు వారాల క్రితం ‘జవాన్’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ‘జవాన్’ సినిమాలో షారుఖ్ ఖాన్ న‌ట‌న‌తో పాటు పోరాట సన్నేశాలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. యాక్షన్ స‌న్నివేశాల‌ను బిగ్ స్క్రీన్‌ మీద చూసిన‌ప్పుడు ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురవుతారట. హాలీవుడ్‌లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌’, ‘కెప్టెన్ అమెరికా’ వంటి యాక్షన్ మూవీస్‌కి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన స్పిరో ర‌జ‌టోస్.. ‘జ‌వాన్‌’ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్‌ల‌ను కంపోజ్ చేశారు. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న విడుదల కానుంది.





Tags

Read MoreRead Less
Next Story