Sridevi: శ్రీదేవి ముద్దు ఇస్తుందని నోరు కడుక్కుని వెళితే..

Sridevi: శ్రీదేవి ముద్దు ఇస్తుందని నోరు కడుక్కుని వెళితే..
Sridevi: ఒకప్పుడు మాత్రమే ఇప్పటికీ ఎంతోమంది మూవీ లవర్స్‌కు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి.

Sridevi: ఒకప్పుడు మాత్రమే ఇప్పటికీ ఎంతోమంది మూవీ లవర్స్‌కు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. తనతో ఒక్క సినిమా చేస్తే చాలు అని ఎదురుచూసిన హీరోలు, దర్శకులు ఎందరో.. వారిలో ఒకరు జేడీ చక్రవర్తి. శ్రీదేవి మాత్రమే కాదు జేడీ చక్రవర్తి కూడా కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలతో టాలీవుడ్‌లో వెలిగినవారే. ఆర్‌జీవీ డైరెక్టర్‌గా డెబ్యూ చేసిన 'శివ' సినిమాతోనే జేడీ కూడా నటుడిగా స్క్రీన్‌పై తొలిసారి కనిపించాడు.

మొదటి సినిమాతోనే యాక్టింగ్‌లో మంచి మార్కులు కొట్టేసిన జేడీ ఆ తరువాత సౌత్ సినిమాల్లో కొంతకాలం బిజీ ఆర్టిస్ట్‌గా వెలిగిపోయాడు. హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకున్న జేడీ 'క్షణక్షణం' సినిమాలో శ్రీదేవితో కలిసి నటించే ఛాన్స్‌ను కొట్టేసాడు. జేడీ నటించిన 'మనీ' చిత్రాన్ని చూసినప్పుడు శ్రీదేవి జేడీకి ఒక కాంప్లిమెంట్ ఇచ్చిందట.


నేను ఇప్పటివరకు చూసిన ఇద్దరు బెస్ట్ యాక్టర్స్‌లో ఈ హీరో కూడా ఒకడు అందంట అతిలోక సుందరి. అందుకే 'క్షణక్షణం' షూటింగ్ సమయంలో శ్రీదేవికి ముందుకు వెళ్లి హలో మేడమ్ అన్నాడు జేడీ. దానికి ఆమె రియాక్ట్ అవ్వకుండా వెళ్లిపోయారట. అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినందుకు కనీసం హగ్ అయినా చేసుకుంటుందేమో లేదా ముద్దు పెడుతుందేమో అనుకున్నా. మౌత్ వాష్ కూడా చేసుకొని వెళ్లానని జెడి చక్రవర్తి ఒక ఇంటర్వ్యూ తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story