సినిమా

Mrunal Thakur: 'జెర్సీ' హీరోయిన్‌కు కరోనా.. ఆందోళనలో మూవీ టీమ్..

Mrunal Thakur: ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో చాలామంది కరోనా బారిన పడుతున్నారు.

Mrunal Thakur (tv5news.in)
X

Mrunal Thakur (tv5news.in)

Mrunal Thakur: ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో చాలామంది కరోనా బారిన పడుతున్నారు. మరోసారి కరోనా వ్యాప్తిలో వేగం పుంజుకుంది. దీంతో రెండు డోసులు తీసుకున్న వారికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవుతోంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇలాగే జరిగింది. ఇటీవల 'జెర్సీ' హీరోయిన్ కూడా కరోనా బారిన పడినట్టు వెల్లడైంది.

తెలుగులో నేచురల్ స్టార్ నానికి ఎంతగానో పేరు తెచ్చిపెట్టిన చిత్రం 'జెర్సీ'. ఈ సినిమా త్వరలోనే హిందీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 31న హిందీ 'జెర్సీ' ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ ఒమిక్రాన్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా మూవీ టీమ్‌కు మరో షాక్ తగిలింది. జెర్సీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్న సినిమా హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు కరోనా అని నిర్దారణ అయ్యింది.

ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా సోకింది. కపూర్ ఫ్యామిలీలో కొందరికి, నోరా ఫతేహీకి కరోనా సోకడంతోనే వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఈ లిస్ట్‌లో చేరింది మృణాల్ ఠాకూర్. తాజాగా తనకు కరోనా నిర్దారణ అయినట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మొన్నటి వరకు తనతో పాటు జెర్సీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న వారంతా ఆందోళన చెందుతున్నారు.Next Story

RELATED STORIES