సినిమా

అప్పుడు కాలకేయుల గ్యాంగ్‌లో ఒకరు..ఇప్పుడు ఆ సినిమాతో పాపులర్ స్టార్..

John Kokken:బాహుబలి సినిమాలో ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్కల తర్వాత గుర్తొచ్చే మరో పాత్ర కాళకేయ.

అప్పుడు కాలకేయుల గ్యాంగ్‌లో ఒకరు..ఇప్పుడు ఆ సినిమాతో పాపులర్ స్టార్..
X

ఒక్క ఛాన్స్ పేరుతో సినిమా ఇండస్ట్రీ చూట్టూ తిరిగే వారు అనేక మంది ఉంటారు. వారిలో సినిమాల్లో నటించే అవకాశం చాలా తక్కువ మందికే వస్తుంది. అదృష్టం కొద్దీ సినిమాల్లో ఛాన్స్ వచ్చినా.. ఏదో ఒకటి రెండు సీన్లలో మెరిసిపోతారు. అయితే సినిమాలో వచ్చే డైలాగ్స్, సీన్స్ ను బట్టి వారు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ 'బాహుబలి'. ఈ చిత్రంలో ఎందరో నటీనటులు భాగస్వామ్యం అయ్యారు. కానీ ఇందులో కొన్ని పాత్రలకే గుర్తింపు దక్కింది.

అయితే బాహుబలి సినిమాలో ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్కల తర్వాత గుర్తొచ్చే మరో పాత్ర కాళకేయ. కాళకేయుడిగా ప్రభాకర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. కొంత మంది నటులు బాహుబలిలో ఉన్నారా?' అనుకునే గుర్తుపట్టలేని పాత్రలు కూడా చాలా ఉన్నాయి. అలాంటిదే జాన్‌ కొక్కెన్‌ పాత్ర కూడా ఒకటి. బాహుబలిలోని తన పాత్ర గుర్తు చేస్తూ సోషల్‌ మీడియాలో ఫొటో షేర్‌ చేశాడు. బాహుబలిలోని కాలకేయుల గ్యాంగ్‌లో జాన్‌ కొక్కెన్‌ కూడా ఉన్నాడు.

జాన్‌ కొక్కెన్‌ ఆ ఫొటోను షేర్‌ చేస్తూ.. 'బాహుబ‌లిలో చిన్న పాత్ర చేశాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ గుర్తుంది. ఆ స‌మ‌యానికి నా పేరు ఎవరికీ తెలియ‌దు. అయితే ఏదో ఒక రోజు నా పేరు అంద‌రికి తెలుస్తుంద‌ని చెప్పాను. ఆ స‌మ‌యం ఇప్పటికి వ‌చ్చింది. అందుకే ఇప్పుడు ఈ ఫొటోను గర్వంగా షేర్‌ చేస్తున్నాను. ఏదో ఒకరోజు నన్ను అందరూ గుర్తించే స్థాయికి ఎదుగుతానని అజిత్‌ సార్‌ చెప్పారు. ఆ రోజు ఇప్పుడు వచ్చింది' అంటూ రాసుకొచ్చాడు.

'సార్పట్ట'తో ఒక్కసారిగా అందరిని దృష్టి ఆకర్షించాడు జాన్‌ కొక్కెన్‌. 'సార్పట్టా' చిత్రంలో వెంబులి(వేటపులి) పాత్రలో జాన్‌ కొక్కెన్‌ నటించాడు. పా.రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. జాన్‌ కొక్కెన్‌ కేజీఎఫ్‌ చాప్టర్‌ వన్‌ తోపాటు పలు సినిమాల్లో నటించాడు.Next Story

RELATED STORIES