సినిమా

Jr NTR: తాను డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాల గురించి బయటపెట్టిన ఎన్‌టీఆర్..

Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రతీ భాషా ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్లడానికి మూవీ టీమ్ ఎంతగానో కష్టపడుతోంది.

Jr NTR (tv5news.in)
X

Jr NTR (tv5news.in)

Jr NTR: 'ఆర్ఆర్ఆర్' సినిమాను ప్రతీ భాషా ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్లడానికి మూవీ టీమ్ ఎంతగానో కష్టపడుతోంది. ప్రతీ రాష్ట్రానికి వెళ్తూ.. అక్కడి ప్రేక్షకులతో, అభిమానులతో చాలా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌కు సంబంధించిన ప్రొఫెషనల్ విషయాలే కాదు.. పర్సనల్ విషయాలు కూడా అందరితో పంచుకుంటున్నారు. ఇటీవల ఎన్‌టీఆర్ కూడా తాను డిప్రెషన్‌లోకి వెళ్లిన రోజుల గురించి బయటపెట్టాడు.

17 ఏళ్ల వయసులోనే హీరోగా, నందమూరి వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు ఎన్‌టీఆర్. మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా.. ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి సినిమాలు తనకు వరుసగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. అప్పటికీ ఎన్‌టీఆర్ వయసు 19 ఏళ్లే. 19 ఏళ్లకే స్టార్‌‌డమ్‌ను చూసిన ఎన్‌టీఆర్ కెరీర్ ఆ తరువాత అంత సాఫీగా సాగలేదు.

వరుస ఫ్లాపులతో ఎన్‌టీఆర్ కెరీర్ డీలా పడిపోయింది. అదే సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లానని ఎన్‌టీఆర్ అన్నారు. ఆ స్టేజ్ నుండి బయటికి రావడానికి రాజమౌళి సాయం చేశాడని తెలిపారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న తనతో యమదొంగ తీసి మళ్లీ తన కెరీర్‌ను సూపర్ హిట్ ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు రాజమౌళి. యమదొంగ తరువాత ఎన్‌టీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Next Story

RELATED STORIES