సినిమా

Jr NTR : ఊరమాస్ లుక్‌లో ఎన్టీఆర్.. పోస్టర్‌లో ఇది గమనించారా..!!

Jr NTR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఏ చిన్న క్లిప్పింగా వచ్చినా అభిమానులకు అదో పెద్ద సెన్సేషన్.

Jr NTR : ఊరమాస్ లుక్‌లో ఎన్టీఆర్.. పోస్టర్‌లో ఇది గమనించారా..!!
X

Jr NTR : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఏ చిన్న క్లిప్పింగా వచ్చినా అభిమానులకు అదో పెద్ద సెన్సేషన్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్, తారక్ హీరోలు కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. తాజాగా సినిమాలో భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ లుక్‌లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ఆవిషయం స్పష్టంగా కనిపిస్తుంది.. ఓ సన్నివేశంలో వీరోచిత పోరాటంలో భాగంగా ఎన్టీఆర్‌ ఈ లుక్ ఉంటుందని తెలుస్తోంది.. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలెట్ గా నిలుస్తుందని టాక్. కాగా టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇలా సిక్స్ ప్యాక్‌లో కనబడడడం విశేషం. అటు ఈ రోజు సాయింత్రం 4గం.లకు రాంచరణ్ లుక్‌ను కూడా విడుదల చేస్తామని పేర్కొంది. మరో మూడు రోజుల్లో ట్రైలర్ విడుదల కానుండా, ఈలోపు ఫ్యాన్స్ కోసం ఇలా సర్‌ప్రైజ్‌లో ఇస్తోంది.Next Story

RELATED STORIES