Threads: ఖాతాలు తెరచిన Jr. NTR, రాపో

Threads:  ఖాతాలు తెరచిన  Jr. NTR, రాపో
మెటా నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన 'థ్రెడ్' యాప్ లో...


టాలీవుడ్ హీరోలు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఎకౌంట్ ను ఓపెన్ చేశారు. మెటా నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన 'థ్రెడ్' యాప్ లో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్, పోతినేని రామ్ తమ ఎకౌంట్లను ఓపెన్ చేశారు. దీంతో వారి అభిమానులు సైతం 'థ్రెడ్' యాప్ లో ఎకౌంట్స్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది ట్విట్టర్ కు పోటీగా రిలీజ్ అయినట్లు తెలుస్తోంది.






సోషల్ మీడియాలో మరో యాప్ రంగప్రవేశం చేసింది. ఫేస్ బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ దూసుకుపోతున్న మెటా సంస్థ 'థ్రెడ్' అనే యాప్ ను యూజర్లకు చేర్చింది. ఇది ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలతో విసుగెత్తిన నెటిజన్లకు 'థ్రెడ్' ఒక గమ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 100 కంటే ఎక్కువదేశాలలో ఈ యాప్ ను విడుదల చేశారు. ఆపిల్, గుగుల్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ లనుంచి డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. UKలో బుధవారం అర్థరాత్రి 'థ్రెడ్' యాప్ ప్రత్యక్ష్యం అయింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ యాప్ లో తమ ఎకౌంట్స్ ను ఓపెన్ చేసుకుంటున్నారు.

థ్రెడ్ లో 500 అక్షరాలు పరిమితం చేశారు. ట్విట్టర్ లో మాత్రం 280 అక్షరాలే పోస్ట్ చేయవచ్చు. ఐదు నిమిషాల కంటే ఎక్కువ వీడియోలను సైతం పోస్ట్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్ గా థ్రెడ్ యాప్ లో లాగిన్ అయ్యే వెసులుబాటును కల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story