సినిమా

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. ఇన్‌స్టా పోస్ట్‌తో భర్త గౌతమ్ క్లారిటీ..

Kajal Aggarwal: కాజల్, తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకుంది.

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. ఇన్‌స్టా పోస్ట్‌తో భర్త గౌతమ్ క్లారిటీ..
X

Kajal Aggarwal: గతేడాది.. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా కొంతమంది సినీ సెలబ్రిటీలు కేవలం తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. దాదాపు పది సంవత్సరాలు పైనే కాజల్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. అలాంటి కాజల్, తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను 2020 అక్టోబర్ 30న పెళ్లి చేసుకుంది.

కాజల్ పెళ్లి వార్త విని తన ఫ్యాన్స్ అంతా తమ డ్రీమ్ గర్ల్ పెళ్లి అయిపోతుంది అంటూ నిరాశపడ్డారు. పెళ్లి తర్వాత కాజల్.. సినిమాలకు దూరంగా ఉంది. తన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసి సినిమాలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంది కాజల్. కానీ ఇంతలోనే తాను ప్రెగ్నెంట్ అన్న వార్తలు వైరల్ అయ్యాయి. తాను చేస్తున్న సినిమాల నుండి తప్పుకోవడం ఈ రూమర్స్ నిజమేనేమో అనిపించేలా చేశాయి.

కాజల్ ప్రెగ్నెంట్ అని చాలాకాలం నుండి రూమర్స్ వైరల్ అవుతున్నా కూడా కాజల్ కానీ, తన భర్త గౌతమ్ కానీ.. వీటిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి కాజల్ ఫ్యామిలీ అంతా గోవాకు వెళ్లారు. అక్కడ కాజల్ దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసిన గౌతమ్.. తాను ప్రెగ్నెంట్ అని అర్థమయ్యేలా ఓ ఎమోజీను దానికి జతచేశాడు. దీంతో ఈ రూమర్స్ నిజమేనని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది.


Next Story

RELATED STORIES