Kajal Aggarwal: కాజల్ ప్లేస్‌లో అమలాపాల్.. అంటే ఆ వార్తలో నిజముందా..?

Kajal Aggarwal (tv5news.in)

Kajal Aggarwal (tv5news.in)

Kajal Aggarwal: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కూడా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

Kajal Aggarwal: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కూడా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాలపైన కూడా అలాంటి రూమర్సే వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక గుడ్ న్యూస్ చెప్తానంటూ తన ఇన్‌స్టా్గ్రామ్ ఫోలోవర్స్‌తో చెప్పిన కాజల్.. తన కొత్త పప్పీని అందరికీ పరిచయం చేసింది. కానీ అంతకంటే ముందే గుడ్ న్యూస్ అంటే కాజల్ తల్లి కాబోతుందని వార్తలు వచ్చేశాయి.

ఎన్నో సోషల్ మీడియా వేదికలు కాజల్ తల్లి కాబోతోంది అని వార్తలు మొదలుపెట్టేసాయి. ఇప్పటివరకు కాజల్ కానీ, తన భర్త గౌతమ్ కిచ్లు కానీ.. దీనిపై ఏమీ స్పందించలేదు. సినీ వర్గాల్లోని సమాచారం ప్రకారం కాజల్ తల్లి కాబోతుందన్న విషయం నిజమేనేమో అనుకుంటున్నారు తన అభిమానులు.

ఇప్పటికే తన ప్రెగ్నెన్సీ వల్ల పలు సినిమా ప్రాజెక్టులను కోల్పోయిందట కాజల్. తాను పెళ్లి తర్వాత సినిమాలు చేయడం తగ్గించేసింది. కానీ తన చేతిలో ఉన్న రెండు, మూడు ప్రాజెక్టుల నుండి కూడా తాను తప్పుకున్నట్టు సమాచారం. నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రానున్న యాక్షన్ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పుడు తన స్థానంలో మరో హీరోయిన్ రానున్నట్టు సమాచారం.

కాజల్ అగర్వాల్ ఇన్నేళ్ల కెరీర్‌లో మొదటిసారి నాగార్జునతో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ తన ప్రెగ్నెన్సీ వల్ల అది కూడా దూరం అయిపోయింది. ఇప్పటికే షూటింగ్‌ను పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కాజల్ ప్లేస్‌లోకి అమలాపాల్ రానుందట. అమలాపాల్ చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినా.. తనకు ఇక్కడ ప్రేక్షకుల్లో చాలానే ఫాలోయింగ్ ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే కాజల్ తల్లి కాబోతుందన్న వార్తల్లో నిజముందెమో అని అనుమానిస్తున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story