NKR: Happy Birthday కళ్యాణ్ రామ్

NKR: Happy Birthday కళ్యాణ్ రామ్
రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుతూ అన్నదానం చేస్తున్నారు.

నందమూరి ముద్దబిడ్డ కళ్యాణ్ రామ్ పుట్టిరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తాతకు తగ్గ మనవడిగా ఇటు హీరోగా అటు నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. బింభిసారతో విజయఢంకా మోగించిన కళ్యాణ్ రామ్.. అదే సినిమాకు సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ జన్మదినాన నందమూరి అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుతూ అన్నదానం చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. సినీప్రముఖులు, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.రాబోయే చిత్రం డెవిల్ విజయవంతమవ్వాలని కోరుతున్నారు.




బాలగోపాలుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్.. తెలుగు ప్రేక్షకులను అభిమన్యుడుతో ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే నిర్మాతగా మారి విజయాన్ని అందుకున్నాడు. అభిరుచిగల నిర్మాతగా అసాధ్యుడు సినిమాను విజయతీయాలకు చేర్చాడు. వివాదాలకు దూరంగా ఉండే కళ్యాణ్ రామ్ అందరితో మంచిగా ఉంటూ సినీ ఇండస్ట్రీలో జెంటిల్మెన్ పాత్రను పోషిస్తున్నాడు.


తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు బాటలో నడుస్తూ ఇటు హీరోగా, అటు నిర్మాతగా విజయాలను అందుకున్నాడు. ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ మినహా మరెవ్వరూ నిర్మాతగా తన ప్రభావాన్ని చూపలేకపోయారు. కళ్యాణ్ రామ్ ఆ తాతకు తగ్గ మనువడనిపించుకున్నాడు. తెలుగులో తొలి 3D యాక్షన్ మూవీగా ఓం ను తీసిన ఘనత ఈయనకే చెల్లింది. స్టోరీ డిమాండ్ చేస్తే ఎంతఖర్చయినా వెనుకడుగు వేయడనే పేరు తెచ్చుకున్నాడు. తనతో పాటు పనిచేసే దర్శకులకు టెక్నీషియన్లకు, తొటి నటులను కలుపుకుపోవడం మర్యాదతో నడుచుకోవడం కళ్యాణ్ కు ఉన్న మరోకోణమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటన్నాయి. ఇలాంటి మంచి మనిషి నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.




Tags

Read MoreRead Less
Next Story