సినిమా

మహానటితో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఇప్పుడు సౌత్‎లో స్టార్ హీరో

Tollywood: సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహానటితో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఇప్పుడు సౌత్‎లో స్టార్ హీరో
X

Tollywood: సినీ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంత మంది స్టార్స్ స్వయంగా వారి చిన్ననాటి ఫోటోలు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో చిన్నప్పటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఆయన ఎవరో కాదు దక్షిణాది స్టార్ హీరో కమల్ హాసన్. 20ఏళ్ళ వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి,తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

వైవిద్య భరిత సినిమాలు, విభిన్న పాత్రలు పోషిస్తూ కమల్ ప్రేక్షకులు అలరిస్తు్న్నారు. కమల్ ఫైట్స్, డాన్స్ లలో వైవిధ్యం కనబరుస్తుంటాడు. దశావతారం సినిమాలో ఏకంగా 10 ఢిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ట్రెండ్ సెట్ చేశాడు. 62ఏళ్ళ వయస్సులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ అలరిస్తున్నాడు. కమల్ అసలు పేరు పార్ధసారధి. పార్ధు అని ముద్దుగా పిలిచేవారట. కమల్ హాసన్ బాల నటుడుగా కూడా సినిమాల్లో నటించాడు. 4 సంవత్సరాల వయస్సులో కళధూర్ కణ్ణమ్మ మూవీలో నటించిన కమల్ నటన చూసి అప్పట్లో సావిత్రి, జెమిని గణేశన్ సైతం ఆశ్చర్యపోయారట. కమల్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Next Story

RELATED STORIES