Kamal Haasan : బిగ్‌‌బాస్ కి షాకిచ్చిన కమల్ హాసన్..!

Kamal Haasan :  బిగ్‌‌బాస్ కి షాకిచ్చిన కమల్ హాసన్..!
Kamal Haasan : తెలుగుతో పాటుగా పలు భాషల్లో ఫుల్ సక్సెస్ అయిన రియాలిటీ షో బిగ్‌‌బాస్.. తమిళ్‌‌లో కూడా ఈ షోకి మంచి ఆదరణ ఉంది.

Kamal Haasan : తెలుగుతో పాటుగా పలు భాషల్లో ఫుల్ సక్సెస్ అయిన రియాలిటీ షో బిగ్‌‌బాస్.. తమిళ్‌‌లో కూడా ఈ షోకి మంచి ఆదరణ ఉంది. తమిళంలో ఇప్పటివరకు 5 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. మొదటి నుంచి ఈ షోని స్టార్ హీరో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు.

బిగ్‌‌బాస్ తమిళ్ OTT వెర్షన్ అల్టిమేట్ షోను కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నారు. అయితే వచ్చే ఎపిసోడ్స్ నుంచి తాను అందుబాటులో ఉండనని, హోస్ట్ నుంచి వైదొలుగుతున్నట్లుగా కమల్ వెల్లడించారు. తన రాబోయే సినిమా విక్రమ్ సినిమా షూటింగ్ అలాగే రాజకీయ పనులతో నిరంతరం బిజీగా ఉండడం వల్ల కమల్ ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లుగా సమాచారం.

కమల్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఈ షోని ఎవరు హోస్ట్ చేస్తారని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడనుంది. అయితే బిగ్‌‌బాస్ సీజన్ 6కి హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆయన సానుకూలంగా ఉన్నారు.

ఇక కమల్ విక్రమ్ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story