సినిమా

Kamal Hassan: కమల్ హాసన్ సినిమా సెట్‌లో క్వీన్ ఎలిజబెత్.. అది కమల్ అంటే..

Kamal Hassan: ఒక సినిమా కోసం కమల్ హాసన్ చేసినన్ని రిస్క్‌లు బహుశా ఇంకే నటుడు చేసుండడు.

Kamal Hassan (tv5news.in)
X

Kamal Hassan (tv5news.in)

Kamal Hassan: సినిమా అంటే కేవలం ఒక ప్రొఫెషన్ కాదు.. అది ఒక ప్యాషన్.. అది ఒక అడిక్షన్.. ఇలా తమ జీవితాన్నే సినిమాకు దారపోసిన నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటారు కమల్ హాసన్. సినిమాలో క్యారెక్టర్ పండడానికి ఎంత దూరమయినా వెళ్లడానికి తాను సిద్ధం. ఒక సినిమా కోసం తాను చేసినన్ని రిస్క్‌లు బహుశా ఇంకే నటుడు చేసుండడు. ప్రేక్షకులను మెప్పించడం, వారిని ఎంటర్‌టైన్ చేయడంలో కమల్ అసలు లిమిట్స్ ఏమీ పెట్టుకోరు.

తన వర్క్ డెడికేషన్ వల్లే కమల్ హాసన్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఆయనే ఒకప్పటి పాన్ ఇండియా స్టార్. కేవలం ఇండియాలోనే కాదు.. తెలుగు, తమిళం అర్థం కాని దేశాల్లో కూడా కమల్‌కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటనకు భాషతో సంబంధం లేదని నిరూపిస్తూ డైలాగులతో కంటే తన నటనతోనే అందరికీ దగ్గరయ్యారు కమల్. అలాంటి కమల్ పేరు మీద ఇప్పటికీ చెరిగిపోని రికార్డులు ఎన్నో ఉన్నాయి.

కమల్ హాసన్ కేవలం హీరో మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా.. అంతే కాదు.. 24 ఫ్రేమ్స్‌లో దాదాపు అన్నింటిలో కమల్‌కు అనభవం ఉంది. అలా కమల్ హాసన్ చాలా ఇష్టంగా రాసుకున్న ఒక కథే 'మరుధనాయగమ్'. ఈ సినిమాను 1997లో ప్రారంభించారు కమల్. అప్పటికీ పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో ప్రేక్షకులకు తెలియకపోయినా.. ఈ సినిమాను ఆ రేంజ్‌లో ప్లాన్ చేశారు కూడా.

'మరుధనాయగమ్' సినిమా అప్పట్లో ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఈ సినిమా ఓపెనింగ్‌కు క్వీన్ ఎలిజెబెత్‌ను ఆహ్వానించారు కమల్. అంతే కాదు.. ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఎలిజబెత్ ఆయన సినిమా సెట్‌కు వచ్చారు కూడా. ఓపెనింగ్ షాట్‌గా కమల్, పలువురు సీనియర్ నటులతో ఒక ఫైట్ సీన్‌ను ప్లాన్ చేశారు. 1997లోనే ఆ ఒక్క ఫైట్ కోసం కమల్ ఒకటిన్నర కోటిని ఖర్చు పెట్టినట్టు టాక్.అంత ఇష్టంగా ప్రారంభించిన 'మరుధనాయగమ్' సినిమా కొన్నాళ్ల షూటింగ్ తర్వాత అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి కారణాలు ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ కమల్ మాత్రం ఏదో ఒక ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఇప్పటికీ పలుమార్లు వెల్లడించారు. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌ను 'మరుధనాయగమ్'పై వెచ్చించారట కమల్.

'మరుధనాయగమ్' సినిమా ఓపెనింగ్‌కు కమల్ మాత్రమే కాదు.. అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి కూడా హాజరయ్యారు. 1997 అక్టోబర్ 16న ఎంజీఆర్ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ మూమెంట్ ఇప్పటికీ చాలామంది తమిళ ప్రేక్షకులకు గుర్తుంది. 18వ శతాబ్దంలో జీవించిన మరుధనాయగమ్ పిల్లై ఒక యోధుడి జీవితకథ ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నారు కమల్.

Next Story

RELATED STORIES