Kangana Ranaut : కంగనాకు పొగడడం కూడా వచ్చా.. బన్సాలీ 'లివింగ్ లెజెండ్' అంట

Kangana Ranaut : కంగనాకు పొగడడం కూడా వచ్చా.. బన్సాలీ లివింగ్ లెజెండ్ అంట
చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీపై ప్రశంసల వర్షం కురిపించిన కంగన

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఇప్పుడు మాత్రం ఇంట్రస్టింగ్ న్యూస్ తో ట్రైండింగ్ లో నిలిచింది. తన పోస్టుల్లో ఎప్పుడూ ఎవరో ఒకర్ని విమర్శించే కంగనా.. ఈ సారి మాత్రం ఓ వ్యక్తిపై పొగడ్తల వర్షం కురిపించింది. చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీని 'లివింగ్ లెజెండ్' అని ప్రశంసిస్తూ కంగనా తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆమె.. చాలా సంవత్సరాలుగా, సంజయ్ ప్రొడక్షన్ హౌస్ అందించే పాటలు, పాత్రలను తిరస్కరించినట్లు నోట్ లో రాసుకువచ్చింది. ఒకవేళ సంజయ్ ఇంటికి వెళ్లి కబుర్లు చెప్పాలనుకున్నా, అతను తన ముందు కదిలి వచ్చే దేవుడిలా కూర్చుంటాడని ఆమె పేర్కొంది.

"సంజయ్ లీలా బన్సాలీని నేను ఆర్టిస్ట్‌గా ఎంతో ఆరాధిస్తాను. అతను ఎప్పుడూ విజయాన్ని లేదా కీర్తిని నకిలీ చేయడు.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్లలో అత్యంత అసలైన, విలాసవంతమైన కళాకారుడు. ఇంత నిస్సహాయంగా ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతను సినిమా అనే మాయాజాలంతో ప్రేమలో ఉన్నాడు. అతని అభిరుచితో సాగుతున్నాడు... అన్నింటికీ మించి అతను తన వ్యాపారం, సృజనాత్మకత, అరుదైన సమగ్రతను దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటాడు.. అతను ఒక లివింగ్ లెజెండ్ ... నేను సంజయ్ సార్‌ను ప్రేమిస్తున్నాను ... అంటూ కంగనా రెడ్ కలర్ లవ్ సింబల్ ను జోడించింది.


"సంవత్సరాలుగా SLB ప్రొడక్షన్ ద్వారా నాకు పాటలు/పాత్రలు చేసే అవకాశం వచ్చింది. కానీ కొన్ని లేదా ఇతర కారణాల వల్ల నేను వాటిని చేయలేకపోయాను. ఇప్పటికీ నేను అతనిని చూసినా, అతని ఇంటికి వెళ్లినా.. అతనితో చాట్ చేస్తున్నా.., అతను మాత్రం కళ్లలో దయతో.. సజీవంగా ఉన్న దేవుడిలా మెల్లగా నవ్వుతూ ఉంటారు. SLB జీ అద్భుతమైన పదాల మనిషి" అంటూ ఆమె రాసుకువచ్చారు.

గోలియోన్ కి రాస్లీలా రామ్ లీలాలో భన్సాలీ తనకు ఒక పాటను అందించినట్లు కంగనా వెల్లడించింది. “అతను నన్ను ఒక కళాకారుడిగా అర్థం చేసుకోవాలనుకున్నాడు, కానీ నాకు అవకాశం రాలేదు. అది పని చేయలేదు. ఇది నా అతిపెద్ద పశ్చాత్తాపాల్లో ఒకటి ” అని కంగనా చెప్పుకువచ్చారు.


Tags

Read MoreRead Less
Next Story