సినిమా

Kangana Ranaut: అతడి వల్లే చై, సామ్‌కు విడాకులు: కంగనా రానౌత్

Kangana Ranaut: నాగచైతన్య, సమంత వారి విడాకుల గురించి ప్రకటించిన తర్వాత పలువురు సెలబ్రిటీలు దీనికి రియాక్ట్ అయ్యారు.

Kangana Ranaut: అతడి వల్లే చై, సామ్‌కు విడాకులు: కంగనా రానౌత్
X

Kangana Ranaut: నాగచైతన్య, సమంత వారి విడాకుల గురించి ప్రకటించిన తర్వాత పలువురు సెలబ్రిటీలు దీనికి రియాక్ట్ అయ్యారు. తాజాగా బాలీవుడ్ కాంట్రవర్షియల్ క్వీన్ కూడా వీరి విడాకులపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సమంత, కంగనాకు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒకరికొకరు పబ్లిక్‌గా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటారు. ఒకరి సినిమాకు మరొకరు ప్రమోషన్ చేస్తుంటారు. అలాంటి కంగనా ఈ విడాకుల గురించి స్పందించిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

'10 ఏళ్లుగా ప్రేమ బంధంలో ఉండి, నాలుగేళ్లుగా వివాహా బంధంలో ఉండి.. విడాకులు తీసుకున్న ఓ సౌత్‌ ఇండియా హీరో.. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోతో పరిచయమ్యారు. ఆ బాలీవుడ్‌కు హీరో విడాకుల స్పెషలిస్ట్‌గా పేరుంది. అతను ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. ఆయన సూచనలు, సలహాల మేరకే సౌత్‌ హీరో విడాకుల నిర్ణయం తీసుకున్నాడు'అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో కామెంట్‌ చేసింది. ఇది పరోక్షంగా అమీర్ ఖాన్‌ను అంటున్న మాటలే అని సినీ ప్రపంచం మొత్తానికి తెలుసు.


దీంతో పాటు విడాకులు విషయంలో తప్పు అంతా మగవారిదే ఉంటుందని, ఆడవారిది తప్పు ఉన్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. అలా మగవారు అందరినీ ఉద్దేశిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు భారీ దుమారాన్నే రేపుతున్నాయి. కాగా అమీర్‌కు, తనకు ఉన్న వ్యక్తిగత గొడవలను చై, సామ్ విడాకులతో ముడిపెట్టడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

RELATED STORIES