Kangana Ranaut : 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష..!

Kangana Ranaut :  1947లో వచ్చింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష..!
బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కేవలం భిక్ష మాత్రమే అన్నారు.

Kangana Ranaut : బాలీవుడ్ యాక్టర్ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్ర్యం కేవలం భిక్ష మాత్రమే అన్నారు. అలా వచ్చిన దానిని స్వాతంత్ర్యం అనలేమని, అది బ్రిటిష్ పాలనకు పొడిగింపు మాత్రమేనంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందంటూ ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు కంగనా. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

కంగనా కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాంతంత్ర్యంపై కంగనా చేసిన కామెంట్స్ దేశద్రోహం పరిధిలోకే వస్తాయంది కాంగ్రెస్. కంగనాకు ఇచ్చిన పద్మశ్రీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కంగనా దేశప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కంగనా కామెంట్స్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆప్ వర్కింగ్ కమిటీ మెంబర్ ప్రీతి శర్మ మీనన్. దేశ ద్రోహం స్థాయి కామెంట్స్ చేసినందుకు కంగనాపై చర్యలు తీసుకోవాలన్నారు. కంగనా కామెంట్స్ ను శివసేన లీడర్ ప్రియాంక చతుర్వేది కూడా తప్పు పట్టారు.

కంగనా కామెంట్స్ ను తీవ్రంగా తప్పు పట్టారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. కంగనా గతంలో మహాత్మ గాంధీ త్యాగాలను అవమానించారని, ఆయన్ను కాల్చి చంపిన వ్యక్తిని కీర్తించారని గుర్తు చేశారు. ఇప్పుడు స్వాంతంత్ర్య సమరయోధుల త్యాగాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ట్వీట్ చేశారు. ఇదంతా పిచ్చి అనుకోవాలా....దేశ ద్రోహంగా పరిగణించాలా అన్నారు. దీనిపై కంగనా ఇన్ స్టా వేదికగా మరోసారి స్పందించారు. 1857 సిపాయిల తిరుగుబాటును అణచివేసిన బ్రిటిషర్ల ఆకృత్యాలు మరింత పెరిగిపోయాయన్నారు. దాదాపు శతాబ్ధం తర్వాత గాంధీ ముష్టి పాత్రలో స్వాతంత్ర్యం ఇచ్చారంటూ కామెంట్ చేశారు. ఇక వెళ్లి మరింత ఏడవండి అంటూ కామెంట్స్ చేశారు కంగనా.

Tags

Read MoreRead Less
Next Story