kaththi movie: చిరంజీవి వదిలేసుకున్న 'కత్తి'లాంటి సినిమా విజయ్ చేతికి..

kaththi movie (tv5news.in)

kaththi movie (tv5news.in)

kaththi movie: ఒక హీరోకు ఒక కథ నచ్చకపోవడం.. మరో హీరోకు అదే కథ కలిసిరావడం లాంటివి సినీ పరిశ్రమలో జరుగుతూనే ఉంటాయి.

kaththi movie: మామూలుగా ఒక హీరోకు ఒక కథ నచ్చకపోవడం.. మరో హీరోకు అదే కథ కలిసిరావడం లాంటివి సినీ పరిశ్రమలో జరుగుతూనే ఉంటాయి. అలాగే జరిగింది విజయ్ 'కత్తి' సినిమా విషయంలో కూడా. ముందుగా ఈ కథను దర్శకుడు మురుగదాస్.. మెగాస్టార్ చిరంజీవికి చెప్పారు. కథ నచ్చినా కూడా అప్పటికీ రాజకీయాల్లో బిజీగా ఉన్న చిరు.. ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. అలా ఈ కథ విజయ్ చేతికి వెళ్లింది. కానీ విశేషం ఏంటంటే తమిళంలో హిట్ అయిన ఈ సినిమాను ఏరికోరి తన కమ్‌బ్యాక్ మూవీగా ఎంచుకున్నాడు చిరంజీవి.

చాలాకాలం గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీ నెం.150. సోషల్ మెసేజ్‌తో తెరకెక్కిన విజయ్ 'కత్తి'ని ఖైదీ నెం.150గా రీమేక్ చేశారు చిరంజీవి. ఒకప్పుడు తనను కోరి వచ్చిన కథను కాదనుకున్న చిరు.. మళ్లీ అదే కథ కావాలంటూ కత్తిని తెలుగులోకి తీసుకొచ్చాడు. అయితే మురుగదాస్‌ను కాకుండా వివి వినాయక్‌ను దీనికి దర్శకుడిగా ఎంచుకోవడం అప్పట్లో ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మెసేజ్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కలిపి ప్రేక్షకులను మెప్పించడంలో మురుగదాస్ దిట్ట. అలాంటి ఒక చిత్రమే 'కత్తి' కూడా. రైతుల కష్టాలను మనం ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూసుంటాం. కానీ కత్తిలో మురుగదాస్ చూపించిన విధానం వేరేగా ఉంటుంది. దానికి తోడు విజయ్ నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది. కత్తి తర్వాత విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌కు మరింత క్రేజ్ పెరిగింది.

అంతే కాదు కత్తి సినిమాలో ఒక అరుదైన విశేషం కూడా ఉంది. మామూలుగా సినిమాలో మద్యపానం, ధూమపానం సన్నివేశాలు వచ్చినప్పుడు అవి ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిక రావడం చూస్తూనే ఉంటాం. కానీ కత్తిలో అలాంటి ఒక్క ఫ్రేమ్ కూడా లేదు. అంటే సినిమాలో మద్యపానం, ధూమపానాన్ని ప్రోత్సహించే ఒక సన్నివేశం కూడా లేదు.

చాలారకాలుగా చాలామందిని ఇన్స్‌పైర్ చేసిన కత్తి సినిమాకు నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఇంకా ఎన్నేళ్లయినా విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సోషల్ మేసేజ్ సినిమాలను ఇష్టపడేవారికి గుర్తుండిపోయే విధంగా కత్తిని తెరకెక్కించాడు మురుగదాస్.

Tags

Read MoreRead Less
Next Story