సినిమా

Keerthy Suresh Birthday: కీర్తి పుట్టినరోజున ఫ్యాన్స్‌కు ఇవే ట్రీట్..

Keerthy Suresh Birthday: మలయాళం అమ్మాయే కానీ.. తెలుగు చక్కగా మాట్లాడుతుంది.

Keerthy Suresh (tv5news.in)
X

Keerthy Suresh (tv5news.in)

Keerthy Suresh Birthday: మలయాళం అమ్మాయే కానీ.. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే అనిపించే అందం, అభినయం ఆమె సొంతం. అలనాటి మహానటి సావిత్రి పాత్ర పోషించి.. సావిత్రమ్మ మళ్లీ పుట్టిందా అనిపించేలా చేసింది ఆమె నటన. తనే కీర్తి సురేశ్. 'నేను శైలజా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన కీర్తి పుట్టినరోజు నేడు. అందుకే తన అప్‌కమింగ్ సినిమాలలోని పోస్టర్స్‌ను విడుదల చేసాయి ఆయా మూవీ టీమ్స్. తన పుట్టినరోజు ఇవే తన ఫ్యాన్స్‌కు ట్రీట్‌గా భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించే అవకాశం వచ్చిందంటే ఏ హీరోయిన్ ఎక్కువశాతం వదులుకోవడానికి ఇష్టపడదు. అందుకే ఆయన పక్కన చెల్లిగా నటించడానికి అయినా ఓకే చెప్పేసింది కీర్తి సురేశ్. వీరిద్దరు అన్నా, చెల్లెల్లుగా నటిస్తున్న 'భోళా శంకర్' నుండి కీర్తి బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల అయ్యింది.


కీర్తి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తొలిసారి జతకడుతున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులో కీర్తి ఒకపక్క మోడర్న్ అమ్మాయిగా.. మరోపక్క ట్రెడీషినల్ లుక్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే విడుదలయిన టీజర్‌లో తన 2 షేడ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.


కీర్తి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన అవి అనేక కారణాల వల్ల ఇంకా ప్రేక్షకుల ముందుకు రావట్లేదు. అందులో ఒకటి 'గుడ్ లక్ సఖి'. ఈ సినిమా షూటింగ్ చాలాకాలం క్రితమే పూర్తిచేసుకున్నా ఇంకా దీని విడుదలపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్‌తో రిలీజ్‌ను ఖరారు చేసింది గుడ్ లక్ సఖి టీమ్.Next Story

RELATED STORIES