Khiladi Ravi Teja: 'ఖిలాడి'పై కోర్టులో కేసు.. ట్రైలర్ లేట్ అవ్వడం వల్ల..

Khiladi Ravi Teja: ఖిలాడిపై కోర్టులో కేసు.. ట్రైలర్ లేట్ అవ్వడం వల్ల..
Khiladi Ravi Teja: రవితేజ ఖిలాడి సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన వెంటనే దానిపై కేసు వేయాలని ఎదురుచూశాడు రతన్ జైన్.

Khiladi Ravi Teja: 'క్రాక్' సినిమాతో హిట్ అయితే కొట్టేశాడు కానీ రవితేజ తరువాతి సినిమా 'ఖిలాడి'కి అయితే అన్నీ కష్టాలే.. ఈ సినిమా గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల ఇంతకాలం పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఖిలాడి కష్టాలు ఇంకా తీరినట్టు అనిపించడం లేదు. తాజాగా ఖిలాడికి లీగల్ కష్టాలు ఎదురయ్యాయి.

బాలీవుడ్ ప్రేక్షకులకు ఖిలాడి అంటే 1992లో విడుదలయిన అక్షయ్ కుమార్ సినిమానే. ఆ తర్వాత ఎన్ని ఖిలాడిలు వచ్చినా.. ఇది మాత్రమే ఆ టైటిల్‌కు ల్యాండ్‌మార్క్‌లాగా మారిపోయింది. అయితే ఈ టైటిల్‌ను ఉపయోగిచడానికి రమేశ్ వర్మ కానీ, ఖిలాడి సినిమా నిర్మాతలు కానీ ఎటువంటి అనుమతి తీసుకోలేదని వారిపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు చేశాడు హిందీ ఖిలాడి నిర్మాత రతన్ జైన్.

రవితేజ ఖిలాడి సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన వెంటనే దానిపై కేసు వేయాలని ఎదురుచూశాడు రతన్ జైన్. కానీ దానికోసం సినిమా స్క్రీనింగ్ ఆగకూడదు అనుకున్నాడు. కానీ ఖిలాడి మేకర్స్ ట్రైలర్‌ను సినిమా విడుదలకు రెండు రోజుల ముందు రిలీజ్ చేశారు. దీంతో రతన్ జైన్‌కు పెద్దగా టైమ్ లేకుండా పోయింది. ప్రస్తుతం రతన్ జైన్ ఈ టైటిల్ వివాదంపై చాలా సీరియస్‌గా ఉన్నాడు.


ఒకప్పుడు ఖిలాడి అని గూగుల్ చేస్తే.. అక్షయ్ కుమార్ సినిమా వచ్చేదని, ఇప్పుడు మాత్రం రవితేజ సినిమా వస్తుందని అన్నాడు రతన్ జైన్. పైగా ఈ సినిమా హిందీ వర్షన్‌ను కూడా ఇదే టైటిల్‌తో విడుదల చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాగే వదిలేస్తే.. మరికొన్ని బాలీవుడ్ బడా చిత్రాల టైటిల్స్‌ను కూడా తీసేసుకుంటారని అన్నాడు. దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని తెలిపాడు రతన్ జైన్. అలాంటప్పుడు గూగుల్ చేస్తే తెలుగు సినిమాలే వస్తాయని హిందీ రావని అన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story