Tollywood: 'రూల్స్ రంజన్' నుంచి రొమాంటిక్ సాంగ్

Tollywood: రూల్స్ రంజన్ నుంచి రొమాంటిక్ సాంగ్
యూత్ ను ఆకట్టుకుంటోన్న 'సమ్మోహనుడా' సాంగ్


యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 'రూల్స్ రంజన్' నుంచి తాజాగా లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటను శ్రేయా గోషాల్ పాడగా అమ్రేష్ గణేష్ సంగీతం అందించాడు. "సమ్మోహనుడా పెదవిస్తా నీక్కొంచెం కొరుక్కోవా.. ఇష్టసఖుడా నడుమే ఇస్తా నలుగే పెట్టుకోవా" అంటూ సాగే పాటలో డిజే టిల్లూ ఫేం నేహా శెట్టి గ్లామరస్ గా కనిపించింది. రొమాంటిక్ కామెడీగా సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం సమర్పిస్తుండా... స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వేమూరి మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు.




'రాజా వారు రాణి గారు' సినిమాతో వెండి తెరకు పరిచయమైన కిరణ్ అబ్బవరం హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణుకథతో మంచి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ప్రమోషన్ చేస్తున్నాడు. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా జతకట్టింది. ఈ ప్రోమో సాంగ్ లో శ్రేయా గోషాల్ వాయిస్, నేహ డాన్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ప్రోమో యూత్ ను కట్టిపడేసింది. ఇందులో వెన్నెల కిషోర్, అజయ్, హైపర్ ఆది, వైవా హర్ష తదితరులు నటించారు.

Tags

Read MoreRead Less
Next Story