సినిమా

Simbu : స్టార్‌ హీరో శింబుకు అరుదైన గౌరవం..!

Simbu : సినీ హీరో శింబుకి అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులోని ప్రముఖ వేల్స్‌ యూనివర్శిటీ ఆయనని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

Simbu : స్టార్‌ హీరో శింబుకు అరుదైన గౌరవం..!
X

Simbu : సినీ హీరో శింబుకి అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులోని ప్రముఖ వేల్స్‌ యూనివర్శిటీ ఆయనని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సినీ పరిశ్రమకి శింబు చేసిన సేవలకి గాను ఈ గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా శింబు పంచుకున్నాడు. తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. అంతేకాకుండా ఈ గౌరవాన్ని తన తల్లిదండ్రులకి అంకితం ఇస్తున్నట్టుగా వెల్లడించాడు.

ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. అభిమానులు శింబుకి అభినందనలు తెలుపుతున్నారు. . తన తండ్రి టి.రాజేందర్‌ దర్శకత్వం వహించిన చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన శింబు ఆ తరవాత హీరోగా మారి ఈశ్వరన్‌, మానాడు, విన్నైతాండి వరువాయా, కోవిల్‌, వాలు వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు. ఇక తమిళనాట గతంలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, విజయ్, విక్రమ్ వంటి ప్రముఖ నటులకు డాక్టరేట్ లభించింది.

Next Story

RELATED STORIES